గ్లామర్ క్వీన్ కాజల్ సినిమా రంగంలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిపోవడంతో ఆమె కెరియర్ అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో ఈ సమ్మర్ రేస్ కు వచ్చినరెండు భారీ సినిమాలలో కాజల్ హీరోయిన్ గా నటించడంతో తిరిగి ఆమె హవా మొదలవుతుంది అని అనుకున్నారు అంతా. అయితే కాజల్ నటించిన రెండు భారీ సినిమాలు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ భారీ ఫ్లాప్ లుగా మారడంతో కాజల్ మళ్ళీ ఐరన్ లెగ్ బ్యూటీగా మారిపోయింది. 

దీనితో స్టార్  హీరోలతో మూవీలు చేశానన్న ఆనందం కాజల్ కు మూడునాళ్ళ ముచ్చటగా మారిపోయింది. ఒకవైపు అవకాశాలు తగ్గిపోయిన నేపధ్యంలో ఒకే సీజన్ లో ఆమె నటించిన రెండు భారీ సినిమాలు ఘోరమైన ఫ్లాపులుగా మారడంతో కాజల్ ను కోలుకోలేని దెబ్బకొట్టాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కాజల్ లేటెస్ట్ గా చెన్నైలో ఒక షాప్ ప్రారంభానికి అతిధిగా వెళ్ళింది. 

అయితే అక్కడ ఆమెకు ఒక మీడియా ప్రతినిధి నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల డిజాస్టర్లపై ఏమనిపిస్తుందని ఆ రిపోర్టర్ అడిగినప్పుడు కాజల్ చాల అతి తెలివిగా సమాధానం ఇచ్చింది. తాను ఫ్లాపులను హృదయం వరకు, అలాగే సక్సెస్‌ను తల వరకు తీసుకోనని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు సినిమా హిట్టా, ఫ్లాపా అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందని అంటూ  ఈ రెండు మూవీల్లో మంచి రోల్స్ చేశానని తనవరకైతే తన క్యారెక్టర్లకి మంచి పేరు వచ్చిందని కామెంట్స్ చేసింది కాజల్.  

ఈ రెండు సినిమాలు ఫ్లాప్ లుగా మిగిలి పోవడంతో ఇక కాజల్ ఆశలు అన్నీ జూన్ లో విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ ‘దో లఫ్జోం కి కహానీ’ పై భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఈసినిమాలోని కాజల్ లిప్‌ లాక్‌ల గురించి కొద్దిరోజులుగా మీడియా అంతటా తెగ రచ్చ జరుగుతోంది. కనీసం ఈ లిప్ లాక్ అయినా కాజల్ ను రక్షిస్తుందేమో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: