‘బ్రహ్మోత్సవం’ గురించి భయపడాల్సిన పరిస్థితులు లేకపోవడంతో ఇక చాలా చిన్న సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ప్లాన్ గురించి ఆలోచనలు  చేయడం మొదలు పెట్టాయి. ‘సరైనోడు’ స్పీడ్ తగ్గడం ‘సుప్రీమ్’, ‘24’ సినిమాలు కూడా మూడు వారంలోకి వచ్చేశాయి కాబట్టి ఇక జూన్ నెల అంతా చిన్న సినిమాల మాసంగా మారబోతోంది. అయితే ఈ శుక్రవారం ఎవరైనా తమ కొత్త సినిమా రిలీజ్ చేసుకునే అవకాశం ఉన్నా ‘బ్రహ్మోత్సవం’  భయంతో వెనక్కి తగ్గాయి. 

ఆఖరికి ఈ శుక్రవారం వస్తుందనుకున్న సందీప్ కిషన్ సినిమా ‘ఒక్క అమ్మాయి తప్ప’  కూడ అనుకోకుండా వాయిదా పడిపోయింది. అయితే ఇప్పుడు థియేటర్లలో ఉన్న సినిమాలకు భయపడుతున్నారో లేక జూన్ 2న రాబోయే ‘అ..ఆ’ ను చూసి ఖంగారు పడుతున్నారో  తెలియదు కానీ ఈ శుక్రవారాన్ని ఖాళీగా వదిలేసి చిన్న సినిమా నిర్మాతలు చాలా తప్పు చేసారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

అయితే ‘అ..ఆ’ రిలీజైన తర్వాతవచ్చే వారానికి మాత్రం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఆ రోజు జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆ రోజును టార్గెట్ చేస్తూ ‘ఒక్క అమ్మాయి తప్ప’ మాత్రమే కాకుండా నిహారిక నాగశౌర్యల ‘ఒక్క మనసు’ సుమంత్ అశ్విన్ ‘రైట్ రైట్’ కూడా అదే రోజు విడుదలవుతున్నాయి. 

దీనితో బాలయ్య పుట్టినరోజు నాడు ఈచిన్న సినిమాలు పోటీ ఏమిటి అంటూ కామెంట్స్  వినిపిస్తున్నాయి. అయితే  బాలయ్య పుట్టినరోజు సెంటిమెంట్ మెగా డాటర్ నిహరికకు ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: