అందాల రాక్షసి సినిమాతో లవర్ బోయ్ గా క్రేజ్ ను సంపాదించిన నవీన్ చంద్ర ఇప్పుడు కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేదన్నది వాస్తవం. చేస్తున్న సినిమాలేవి సక్సెస్ అవ్వకపోగా అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అయితే టాలెంట్ ఉన్నా సరే నవీన్ చంద్రకు ఎందుకు ఇలా జరుగుతుందో అర్ధం కావట్లేదు. తను ఎంచుకునే కథల విషయంలోనే మరింత జాగ్రత్త పడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. 


అందాల రాక్షసి లో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి :


అందాల రాక్షసి తర్వాత తెలుగు తమిళ్ లో ఓ అరడజను సినిమాల దాకా చేశాడు నవీన్ చంద్ర. త్రిపుర అంటూ హర్రర్ నేపథ్యంతో వచ్చిన సినిమాతో హిట్ అందుకుంటాడేమో అనుకున్నారు కాని అది పోయింది. ఇక రాజమౌళి అసిస్టెంట్ జగదీశ్ తలశిల దర్శకత్వంలో వచ్చిన లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా అయినా గట్టేక్కిస్తుంది అనుకుంటే అది కూడా నిరాశ పరచింది.


అందుకే ఈసారి పకడ్బంది స్క్రిప్ట్ తో వస్తున్నాడు నవీన్. చందమామ రావే అంటూ వస్తున్న ఈ సినిమాలో మరోసారి తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటకు తీస్తున్నాడు. ప్రియల్ గోల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ధర్మ-రక్ష అనే ఇద్దరు ట్విన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమా మీద మంచి నమ్మకంతో ఉంది.


చందమామ రావే పోస్టర్ :


చందమామ రావే.. టైటిల్ కు అది రాదు వీడు మారడు అనే ఉప శీర్షిక కూడా పెట్టారు. మరి అందాల రాక్షసిలో కూడా ఇలా రఫ్ పాత్రలో లవర్ బోయ్ గా ప్రేక్షకుల మనసు గెలిచాడు నవీన్ చంద్ర మరోసారి ఆ మ్యాజిక్ ఈ సినిమాకు వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: