బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరో.  కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కు సల్మాన్ ఖాన్ కి అవినాభావ సంబంధం ఉంది. ఆ మద్య భజరంగ్ భాయ్ జాన్ సినిమాకు కథ అందించింది ఎవరో కాదు బాహుబలి చిత్రంతో తెలుగువారి సత్తా ఏమిటో నిరూపించిన దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సుల్తాన్.

సుల్తాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్


ఈ మూవీ ట్రైలర్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మల్లాయోధుడు సుల్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ఒకటి విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లో సల్మాన్ ఖాన్ మీసాలతో కండలు తిరిగిన యోధుడిలా కనిపిస్తున్నాడు. మల్లయుద్దం చేస్తూ.. బరిలోకి ప్రత్యర్థిని ఒక్క పట్టుకే మట్టికరిపిస్తూ మీసం మెలేస్తూ.. నిజంగా సల్మాన్ ఖాన్ తన స్టామినా ఏమిటో చూపిస్తున్నాడు. ఈ టీజర్ సల్మాన్ అభిమానులను మెస్మరైజ్ చేసింది. .

సల్మాన్ ఖాన్


హర్యానాకు చెందిన రెజ్లర్ సుల్తాన్ ఆలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తుండగా ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా అనుష్క శర్మ నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ సుల్తాన్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. సినిమాను ఈ యేడాది రంజాన్ కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: