మాటల మాత్రికుడు త్రివిక్రం సెల్యులాయిడ్ నుండి వస్తున్న మరో అద్భుత సినిమా అఆ.. పక్క పక్కనే ఉన్న రెండు అక్షరాల పరిచయానికి పాతికేళ్ల సమయం పట్టిందన్న త్రివిక్రం టీజర్ లో వదిలిన డైలాగ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. జూన్ 2 న రిలీజ్ కన్ఫాం చేసుకున్న ఈ సినిమా ఇక ప్రమోషన్స్ కు రెడీ అవుతుంది. ఇంతవరకు ఎప్పుడు సినిమా ప్రె రిలీజ్ ప్రమోషన్స్ చేయని త్రివిక్రం మొదటిసారి సినిమా ప్రేక్షకుల్లోకి చేరాలంటే సరైన ప్రమోషన్ కంపల్సరీ అని దానికి సిద్ధమవుతున్నాడు. 


నితిన్, సమంత జంటగా నటించిన అఆలో అనుపమా పరమేశ్వరన్ కూడా ఓ ప్రత్యేక పాత్ర చేసింది. ప్రస్తుతం నితిన్ మళ్లీ హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఆ దాహం తీచేలా త్రివిక్రం హిట్ ఇస్తాడనే నమ్ముతున్నాడు. ఇష్క్ తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చిన నితిన్ మళ్లీ ఫ్లాపులు మూటకట్టుకున్నాడు. అందుకే త్రివిక్రంతో కలిసి అఆ చేశాడు. 


సినిమాలో అనసూయ రామలింగంగా సమంత అదరగొట్టడం  ఖాయమట. ఇప్పటికే ట్రైలర్ లో సమంత క్యూట్ లుక్స్ ఆడియెన్స్ ను సినిమా ఎప్పుడు చూద్దామా అన్నట్టు చేస్తుంది. ఇక ఈ వీకెండ్ నుండి అఆ సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారట. సినిమా అనుకున్నట్టు ఫలితం సంపాదించగలిగితే నితిన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి.  


మాటల మాత్రికుడు మ్యాజిక్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న త్రివిక్రం 'అఆ'ను మరింత శ్రద్ధతో చేశాడు. ఇది తన కథ అంటూ చెప్పు కొచ్చిన త్రివిక్రం మరి తెర మీద దాన్ని ఎలా రూపొందించాడో తెలియాలంటే జూన్2 దాకా వెయిట్ చేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: