హీరోయిన్ జెనీలియా తెలుగులో చేసిన సినిమాలు అతి తక్కువే అయినా 'బొమ్మరిల్లు' సినిమా పేరు చెప్పగానే ఆమె గుర్తుకు రాకుండా ఉండదు. తాను చిన్నప్పటి నుంచి ప్రేమించిన బాలీవుడ్ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ను పెళ్ళి చేసుకున్న తరువాత ఈమె సినిమాలకు దూరమయింది. అయితే లేటెస్ట్ గా రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ముంబాయిలోని  బట్టలు షాపులో దొంగలతనం చేస్తూ ఆ షాప్ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు అంటూ న్యూస్  మీడియాలో హడావిడి చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 

ఇక వివరాలలోకి వెళ్ళితే  బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌  ఒక బట్టల షాప్ లో బట్టలు దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. రితేశ్‌ ముంబయిలోని ఓ బట్టల షాపులో నిన్న బట్టలు కొనడానికి వెళ్ళి నప్పుడు ఈ సంఘటన జరిగింది అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో  వైరల్‌  గా మారింది.

ఇక రితేశ్‌ అభిమానులైతే రితేశ్‌ నిజంగానే దొంగతనం చేస్తున్నాడా అని  షాక్ అయిపోయి  ఈ వీడియోను తమ స్నేహితులకు షేర్ చేస్తూ బిజీగా కాలం గడిపారు. ఈ వీడియో ఫుటేజ్‌లో రితేశ్‌ ఒక రెడీ మేడ్  స్టోర్‌లోకి వచ్చి కొన్ని దుస్తుల్ని ట్రై చేసి మరికొన్ని టీ-షర్టులు తాను వేసుకున్న చొక్కాలో దోపేసుకుని వెళ్లిపోతున్నట్లు  కనిపిస్తోంది. ఇది చూసి అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు అని టాక్.  

అయితే ఆ తరువాత అసలు విషయం బయటకు వచ్చింది. రితేశ్‌ లేటెస్ట్ గా నటించిన హౌస్‌ఫుల్‌ 3 చిత్ర ప్రచారం  కోసం ఒక ప్రముఖ రెడీమేడ్ బ్రాండ్‌ సంస్థ సహకారంతో ఈ వ్యవహారం నడిపారు అని వార్తలు వచ్చాయి. అయితే ఒక బాలీవుడ్ హీరో తన సినిమా ప్రచారం కోసం ఇలా వెరైటీగా  దొంగతనంతో ప్రమోట్ చేయడం బాలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: