స్టార్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. గతంలో రజనీకాంత్ నటించిన చిత్రాలు భారీగా తెరకెక్కిన తరవాత రిలీజ్ కి సంబంధించిన విషయంలో మాత్రం నానా ఇబ్బందులు పడుతూ రిలీజ్ అయ్యేవి. ఆ విధంగా వచ్చిన లింగా మూవీ భారీ డిజాస్టర్ ని చూసింది. అలాగే ఇప్పుడు వస్తున్న కబాలి మూవీ సైతం ప్రస్తుతం రిలీజ్ కి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటుందని అంటున్నారు. కబాలి ఫస్ట్ టీజర్‌తో సోషల్ మీడియాలో ప్రభంజనమే సృష్టించింది.


ఇక ఈ మూవీ జూన్ లోనే రిలీజ్ కావల్సి ఉండగా, ఇప్పుడు జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా రూట్ క్లియర్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో కబాలి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటూ చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆడియో వేడుకకి సంబంధించిన డేట్ ని ఫైనలైజ్ చేశారు. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ జూన్ 10వ తేదీన కబాలి ఆడియోని మార్కెట్ లోని రిలీజ్ చేయనున్నారు.


పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ నటన అద్భుతంగా ఉంటుందని…అభిమానులు రజనీకాంత్ ని ఏ విధంగా చూడలి అనుకున్నారో…కచ్ఛితంగా ఈ సినిమా అలాగే ఉంటుందని రంజిత్ అభిప్రాయపడుతున్నారు. అయితే కబాలి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కటంతో…చాలా మంది ఈ మూవీని కొంటానికి కొంత వెనకడుగు వేస్తున్నారు.


ఇక పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం మూవీని ధైర్యం చేసి భారీ రేటుకి కొంటున్నప్పటికీ…టౌన్ ఏరియాలలోని డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కబాలిపై భారీ ఖర్చుని పెట్టి కొనే ఉద్ధేశం వీరికి లేదని అంటున్నారు. ఇప్పటికీ 60 శాతం బిజినెస్ ని మాత్రమే పూర్తి చేసుకున్న కబాలి మూవీ, మిగిలిన 40 శాతం బిజినెస్ ని పూర్తి చేసుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: