త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ  ఆ’ తో పోటీ పడటానికి ఏ సినిమా సాహసించక పోవడంతో జూన్ 2న విడుదల కాబోతున్న ‘అ ఆ’ కు పోటీలేదు అని అనుకున్నారు అంతా. అయితే ఎవరూ ఊహించని విధంగా చాలాకాలం తరువాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’ ఏకంగా ‘అ ఆ’ ను టార్గెట్ చేస్తూ జూన్ 3న విడుదల కావడం అందరికి షాక్ ఇస్తోంది.

350 సినిమాలలో నటించి టాలీవుడ్ రికార్డులను తిరగ వ్రాసిన సూపర్ స్టార్ కృష్ణ రికార్డులను మరి ఏ హీరో ఇప్పట్లో బ్రేక్ చేసే అవకాశం లేదు.. ఏడాదికి 20 చొప్పున కూడా సినిమాలు రిలీజ్ చేసి ఇండస్ట్రీలో అత్యధికంగా సినిమాలు చేసిన హీరోగా  మాత్రమే కాకుండా మంచి వ్యక్తిగా కూడ కృష్ణకు మంచి పేరు ఉంది.

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కృష్ణ  చాలా గ్యాప్ తరువాత 'శ్రీశ్రీ' సినిమాలో నటించడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే షూటింగ్
పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్నీ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయినా గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో చిన్న సినిమాల రిలీజ్ కు సరైన సమయం దొరకక పోవడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఒక మరాఠీ చిత్రానికి రీమేక్ రూపొందిన ఈ రివెంజ్ డ్రామాని దర్శకుడు ముప్పలనేని శివ బాగా తీసాడు అన్న టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది. 

ఈ సినిమాలో కృష్ణతో పాటు అతడి భార్య విజయనిర్మల ఆమె కుమారుడు నరేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. దీనికితోడు కృష్ణ అల్లుడు యంగ్ హీరో సుధీర్ బాబు ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు ఈసినిమా కోసం వాయస్ ఓవర్ ఇచ్చాడు. ఈమధ్య కాలంలో చాల చిన్న సినిమాలు భారీ సినిమాలకు ఊహించని షాక్ ఇస్తున్న నేపధ్యంలో ఈ ‘శ్రీశ్రీ’ కూడ ‘అ ఆ’ కు షాక్ ఇస్తుందా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: