మాటల మాంత్రికుడు త్రివిక్రం సినిమా తీస్తే హిట్ అన్నట్టే. తన కెరియర్లో రచయితగా పనిచేసినప్పటి నుండి దర్శకుడిగా మారినా సరే ఒక్క ఖలేజా తప్పించి త్ర్తివిక్రం చేసిన సినిమాలన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నవే. అంతేకాదు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు ముఖ్య సన్నిహితుడైన త్రివిక్రం శ్రీనివాస్ కు సూర్య హ్యాండ్ ఇచ్చాడని ఫ్రెష్ అప్డేట్.


త్రివిక్రం సూర్య కాంబినేషన్ లో ఓ క్రేజీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్నాడు. దానికి త్రివిక్రమే కరెక్ట్ పర్సన్ అని తెలుసుకుని తనకు ఓకే చెప్పాడు. సూర్య ఓకే అన్నాడు కదా అని తను చేస్తున్న అఆ తర్వాత ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు మాటల మాంత్రికుడు. 


24 సినిమాలో సూర్య : 


అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం 24 తో సూపర్ హిట్ అందుకున్న సూర్య పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కబాలి సినిమాను డైరెక్ట్ చేస్తున్న పా రంజిత్ సూర్యకు సరిపోయే ఓ కథతో తనను ఇంప్రెస్ చేశాడట. అంతేకాదు త్వరలోనే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని టాక్. 


మరి సూర్య మీద గురి పెట్టుకున్న త్రివిక్రం మాత్రం నిరాశలో ఉన్నాడు. అయితే మరో పక్క సూర్య సింగం-3 షూట్ కొనసాగుతున్నాడు కూడా. మరి సూర్య కాదన్న త్రివిక్రం అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాలున్నాయట. సో మొత్తానికి సూర్య ఇచ్చిన షాక్ కు త్రివిక్రం ఇమేజ్ దెబ్బతిన్నదన్న టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రం అ ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: