బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మొదటి షెడ్యూల్ ను మొరాకో లో ముగించుకుని కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన బాలయ్యను కలిసిన ఆయన సన్నిహితులు బాలకృష్ణ ఈసినిమా కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గి మంచి యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. 

మొరాకో లో ఈ సినిమా షూటింగ్ కోసం రోజుకు 12 గంటలు కష్టపడిన బాలయ్యకు ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం తీవ్రంగా టెన్షన్ పెడుతోంది అని టాక్. మొరాకో షెడ్యూల్ 12 రోజులు జరిగితే దానికి 8 కోట్లు ఖర్చు అయింది అని తెలుస్తోంది. కేవలం సినిమా మొట్టమొదటి షెడ్యూల్ కే ఈస్థాయిలో ఖర్చులు అయితే ఈసినిమా పూర్తి అయ్యే సరికి ఈసినిమా బడ్జెట్ ఏ రేంజ్ కి చేరిపోతుంది అన్న భయం బాలయ్యను వెంటాడుతోంది అని టాక్. 

త్వరలో ఈసినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్న 5 ఎకరాల స్థలాలో భారీ సెట్ వేసి అక్కడ ఈసినిమాలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనే విధంగా భారీ షెడ్యూల్ కు దర్శకుడు క్రిష్ రంగం సిద్ధం చేస్తున్నాడు. దీనితో ఈ సినిమా  రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకునే సరికే ఈసినిమా పై చేసే ఖర్చు దాదాపు 20 కోట్లకు చేరిపోతుందని అంటున్నారు. 

ఇంకా హీరోయిన్ కూడ పూర్తిగా ఎంపిక పూర్తికాని ఈసినిమా బడ్జెట్ ఇలా పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఈసినిమా పూర్తి అయ్యే సరికి ఈసినిమా బడ్జెట్ 60 కోట్లు దాటిపోతుంది అని అంటున్నారు. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘లెజెండ్’ కూడ 40 కోట్ల కలక్షన్స్ ను మించి తెచ్చుకొని నేపధ్యంలో పెరిగిపోతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా బడ్జెట్ బాలయ్యకు కూడ ఒక విధంగా భయాన్ని కలిగిస్తోంది అని టాక్. ఈమధ్య కాలంలో టాప్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ పేలిపోతు ఉండటంతో తన 100వ సినిమాకు మార్కెట్ పరంగా కష్టాలు వస్తే పరిస్థితి ఏమిటి అని బాలయ్య టెన్షన్ పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: