మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ ఆ’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ వర్గాలు ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్. జూన్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 


 ‘అ ఆ’ యూనిట్ ఎందుకు హైలెట్

Image result for a aa movie


త్రివిక్రమ్ మార్క్ సినిమాలలాగే ఎక్కడా ఎటువంటి అశ్లీలత లేకుండా మన మూలాల్ని గుర్తుకు చేసే విధంగా ఈసినిమా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించినట్లు టాక్. కామెడీ కుటుంబ విలువలు ఈసినిమాకు హైలెట్ గా మారుతాయని సెన్సార్ సభ్యులు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమా ఫస్ట్ ఆఫ్ బాగా నడిచినా సెకండ్ ఆఫ్ కొద్దిగా స్లోగా నడిచింది అన్న వార్తలు తెలుస్తున్నాయి. 

ఈసినిమాలో సమంత అద్భుతమైన నటనను ప్రదర్శించింది అని వార్తలు వస్తున్నా మరో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన వార్తలు ‘అ ఆ’ యూనిట్ ఎందుకు హైలెట్ చేయడం లేదు అన్న అనుమానాలు కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా విజయంపైన నితిన్ కెరియర్ ఆధారపడి ఉంటుంది అన్నది వాస్తవం. 

 ‘అ ఆ’ కు



అయితే ఈసినిమాకు సంగీత దర్శకత్వం వహించిన మిక్కీ జే మేయర్ స్వరపరిచిన పాటలు అంతగా హిట్ కాకపోవడం ‘అ ఆ’ కు ఒక మైనస్ పాయింట్ అవుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ‘బ్రహ్మోత్సవం’ ఘోర పరాజయంతో చూడడానికి మంచి సినిమాలు ఏమి లేని నేపధ్యంలో ‘అ ఆ’ కు ఏమాత్రం మంచి టాక్ వచ్చినా ఈసినిమా సూపర్ హిట్ అవడం ఖాయం అని అంటున్నారు. దానికితోడు ఈసినిమాకు ఎటువంటి పోటీ లేకపోవడంతో త్రివిక్రమ్ మ్యాజిక్ ఈసినిమాను గట్టెక్కిస్తుంది అన్న పాజిటివ్ టాక్ ఫిలింనగర్ లో వినపడుతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: