ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అవ్వటం అనే చాలా కామన్. ఎందుకంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా….అలాగే సౌత్ లోని ఏ ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే ఓ కొత్త హీరోయిన్ వచ్చిందంటే….ఆ హీరోయిన్ కి ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించటం చాలా ఈజీ అవుతుంది. తను అందంగానూ, సెక్సీగా ఉండాలే కానీ…ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ ని రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ చేసేస్తున్నారు.


ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఒక్క బ్లాక్ బస్టర్ పడిందంటే చాలు, ఆ హీరోయిన్ కి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ కి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా చిన్న మార్కెట్ అనే ఫీలింగ్ ఏర్పడింది. దీంతో వీరు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చొచ్చుకుని వెళ్ళాలని చూస్తున్నారు.


అలాంటి వారిలో ఇప్పుడు లీడింగ్ లో ఉన్నది శ్రుతిహాసన్, కాజల్ మాత్రమే. తమన్నకి ఆ ఛాన్స్ ఉన్నప్పటికీ…ఈ బ్యూటిని బాలీవుడ్ ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. ఇక అనుష్క, సమంత వంటి హీరోయిన్స్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళదాం అని ప్రయత్నిస్తున్నప్పటికీ…వారికి ఆ ఛాన్స్ కుదరటం లేదు. అయితే తాజాగా సమంత ఓ బాలీవుడ్ చిత్రం కోసం తెగ ప్రయత్నాలు చేసింది.


కానీ చివరినిముషంలో ఆ చిత్రం వారు సమంతని రిప్లేస్ చేసి, శ్రుతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకోవటం తో సమంత బోర్లా పడిందని అంటున్నారు. అయితే సమంతకి ని ఆ చిత్రంలో నటించేందుకు వారు పెట్టిన కండిషన్ ఏమిటంటే..తను బికినిలో కనిపించే ఛాన్స్ ఉంటుందని అన్నారు. ఇందుకు సమంత నో చెప్పటంతో…యస్ చెప్పిన శ్రుతిని తీసుకున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: