బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలేషన్స్ అన్నీ చాలా చిత్రంగా ఉంటాయి. వీటిని మరింత దగ్గరగా ఫోకస్ చేస్తే…వీటికన్నా విచిత్రమైనవి ఇంకేమి ఉండవేమో అని అనుకుంటారు. ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ రెండూ ఒకదానిలో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. దీని కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్, ఫ్యాషన్ ఇండస్ట్రీకి చెందిన ఇంటర్నేషన్ డిజైనర్ తో ఎఫైర్ పెట్టుకుందని అంటున్నారు.


ఇతంతా కరీనాకపూర్ విషయంలో జరుగుతుందని అంటున్నారు. కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కరీనాకపూర్..ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ తో కలిసి తిరుగుతున్నారని అంటున్నారు. దీంతో ఈ న్యూస్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది.


విషయంలో సైఫ్ అలీ ఖాన్ సైతం సెలైంట్ గా ఉండటం విశేషం. ప్రస్తుతం కరీనాకపూర్ చేతిలో తక్కువ చిత్రాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తక్కువ చిత్రాలను ఒప్పుకుంటుంది. తను ఏదైనా మూవీ ఒప్పుకోవాలంటే అందుకు ప్రత్యేకమైన కారణాలు ఉండాలని చెప్పుకుంటుంది. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవటానికి కరీనాకపూర్ అస్సలు అగీకరించటం లేదు.


వ్యక్తిగత లైఫ్ లో ఎఫైర్ కారణంగానే తను ఈ విధంగా సినిమాలకి దూరంగా ఉండాల్సి వస్తుందనే వార్తలు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ జోరుగా వస్తున్నాయి. అయితే గతంలోనూ ఈ తరహా టాక్స్ వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ ఇద్దరూ కలిసి ఖండించారు. ఇప్పుడు వీరిద్దరూ ఈ విషయంపై సైలెంట్ గా ఉండటంతో ఇది చర్ఛనీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: