ప్రస్తుతం బ్రహ్మోత్సవం మూవీకి సంబంధించిన కామెడీ స్పూఫ్ లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్స్ లో అందరూ మాట్లాడిన మాటలు, అలాగే సినిమా రిలీజ్ రోజు, స్పెషల్ షోలో మాట్లాడిన సెలబ్రిటీ మాటలు ఇప్పుడు హాట్ టాక్స్ మారాయి. కొంత మంది బ్రహ్మోత్సవం మూవీ గురించి ఓవర్ గా చెప్పిన వీడియో ఫుటేజ్ కి కొన్ని కామెడీ బిట్స్ యాడ్స్ చేసి ఫేస్ బుక్ వంటి వాటిలో షేరింగ్ లు చేస్తున్నారు.


అలాంటి వాటిలో సీనియర్ హీరో, యాక్టర్ అయిన నరేష్ వీడియో ఒకటి పాపులర్ అవుతుంది. సినిమాని చూసిన తరవాత నరేష్.. బ్రహ్మోత్సవం మూవీ చిత్ర యూనిట్ ని, డైరెక్టర్ ని, హీరోని పొగిడిన తీరు పూర్తి కామెడీగా ఉందని అంటున్నారు. బ్రహ్మోత్సవం బ్లాక్ బస్టర్ అవుతుందని, డైరెక్టర్ కి టర్నింగ్ పాయింట్ అనీ, హీరోకి నేషనల్ అవార్డ్ ఖాయం అంటూ నరేష్ కామెంట్స్ చేశారు.


ఇలా నరేష్ మాట్లాడిన ప్రతి మాటకి కౌంటర్ వీడియోని యాడ్ చేసి పూర్తి ఫన్ గా వీడియోని మార్చారు. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్ బుక్ లో చక్కెర్లు కొడుతుంది. ఇలాంటి వీడియోలు సైతం ఎన్నో వస్తున్నాయి. మహేష్ ని నరేష్ ఓవర్ గా పొగడటంతో ఈ వీడియో మరింత ఫన్ గా మారింది. ఏదేమైనా బ్రహ్మోత్సవం మూవీ ఎఫెట్ చిత్ర యూనిట్ పై బాగానే పడిందని అంటున్నారు.


ప్రస్తుతం అందరూ ఈ మూవీ  ఎందుకు ప్రేక్షకుల నుండి ఎందుకు రిజెక్ట్ అయిందనే కోణంలో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ తన టీంతో కలిసి జరిగిన లోపాల గురించి ఆలోచిస్తున్నారంట. ఏదైతేనేం… బ్రహ్మోత్సవం మూవీపై ప్రస్తుతం ఎవ్వరూ ఎక్కువుగా మాట్లాడకపోవటమే బెటర్ అని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. కాని నిజానికి ఈ సినిమా కొన్ని సెంటర్స్ లో బాగా ఆడుతున్నప్పటికీ…నెగిటివ్ పబ్లిసిటితో కొంత కలెక్షన్స్ తగ్గుతున్నాయని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: