ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు పవన్ కళ్యాన్, మహేష్ బాబు చిత్రాలు భారీ అంచనాల మద్య రిలీజ్ అయ్యాయి..కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయాయి. అయితే ఇండస్ట్రీలో అగ్ర హీరోల చిత్రాలంటే అభిమానులకే కాదు బయ్యర్లకు కూడా పెద్ద అంచనాలే ఉంటాయి..అందుకే ఆ సినిమాలకు ఎక్కువ పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తారు..తీరా రిలీజ్ అయ్యాక అవికాస్తా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడితే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణంగా మహేష్ బాబు చిత్రాలు భారత్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లు రాబడతాయి.


మహేష్ చిత్రాలకు అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. ఇక ఎన్నో అంచనాల మద్య వచ్చిన  బ్రహ్మోత్సవం చిత్రంతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లోనే కాదు వరేస్ట్ చిత్రంలో కూడా మహేష్ నెంబర్ వన్ అయ్యాడు. అయితే బ్రహ్మోత్సవం చిత్రం విడుదలకు ముందు  పాజిటివ్ బజ్ ఉండటం వల్ల బ్రహ్మోత్సవం చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దాంతో 13 కోట్లకు పైగా రేటు పలికింది.

ఇక విడుదలైన తర్వాత సినిమా నెగిటీవ్ టాక్ రావడంతో ఒక్కసారే అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్లు మాత్రమే వసూల్ అయ్యాయి .గతంలో మహేష్ సినిమా ఆగడు ,1 నేనొక్కడినే ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం మంచి వసూళ్ళ ని రాబట్టాయి కానీ బ్రహ్మోత్సవం మరీ నీరసంగా ఉండటం తో ఈ పరిస్థితి ఏర్పడింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: