‘అ ఆ’ మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది  సమంత. అయితే ఈ ఇంటర్వ్యూ వ్యవహారాలను చూస్తున్న సమంత పి.ఆర్. టీమ్ మాత్రం ఈ ఇంటర్వ్యూలలో సమంతను కొన్ని ప్రశ్నలు అడగ వద్దని రిక్వెస్ట్ చేస్తున్నట్లు టాక్.

ఎన్' లాకెట్ వ్యహారం, యంగ్ హీరోతో పెళ్లి, ఆ తరువాత ‘బ్రహ్మోత్సవం’ రిజల్టు గురించి ఎటువంటి ప్రశ్నలు ఆ ఇంటర్వ్యూలో ఉండకూడదని రిక్వెస్ట్ తో కూడుకున్న  కండిషన్స్ సమoత పి.ఆర్. టీమ్  మీడియా వద్ద పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘బ్రహ్మోత్సవం’ మూవీపై  పెళ్ళి విషయం పై ఎక్కువ ప్రశ్నలు మీడియా వేస్తే ఎక్కడ ఇరుకున పడి పోతానో అన్న భయంతో సమoత ఇలా వ్యూహాత్మకంగా ముందుచూపుతో వ్యహరిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 కోలీవుడ్ హీరో విజయ్ ‘తెరి’ తో మొదలుపెట్టి సూర్య ‘24’ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ సినిమాలలో చేసిన తరువాత వస్తున్న ‘అ..ఆ’ ను చాలా ఎక్కువగా ప్రమోట్ చేయాలని సమంత నిర్ణయించుకున్నట్లు టాక్. ఈ మధ్యనే తన లవర్ పెళ్లి గురించి కామెంట్స్ చేయడం పేరు చెప్పకుండా యంగ్ హీరో అనడంతో ఊహాగానాలు ఎక్కువైపోయాయి. 

ఇప్పుడు రీసెంట్ గా మరో ట్వీట్ కూడ చేసింది సమంత. ‘నాకు బాగా నచ్చినవి ఇవే, నా ఎన్ లాకెట్  నా చిన్న ఫ్లాట్లు  నా బకెట్ బ్యాగ్ ఒక గొప్పపుస్తకం' అంటూ వాటి ఫోటోలను కూడా ట్వీట్ చేసింది. దీనితో టాలీవుడ్ లో ఎన్ అక్షరంతో మొదలై సమంతతో ఎక్కువగా సినిమాలు చేసిన యంగ్ హీరో ఎవరో అన్నది అందరికీ ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. రెండు రోజుల క్రితం 'నా పెళ్లి గురించి నేను చెప్పేవరకూ అడగద్దు' అనే ట్వీట్ చేసిన సమంత ఇప్పుడు మీడియా ఇంటర్వ్యూలు అంటే ఎదుకు భయపడి పోతోందో ఆమెకే తెలియాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: