ప్రస్తుతం కమర్షియల్ ఫార్ములాలో వస్తున్న సినిమాలకి హీరోనే కీలకం. హీరోయిన్స్ ఆ సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. హీరోలే ఫైనల్ గా సినిమాని హిట్ చేసేది. అందుకే ఒక్కోసినిమాకి హీరోలు తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. ఒక్కో సినిమాకి వారి లుక్స్ మారుతూ వస్తాయి. ఇందు కోసం హీరోలు చాలానే కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫిజిక్ ని మెయింటెన్ చేయటం కోసం వారు పడరాని పాట్లు పడాల్సి వస్తుంది.


ఏదైనా సినిమా మీద ఉన్న పాషన్ తో వారు ఇలా చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ధృవ’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సెట్స్ మీదకి వెళ్లింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. తెలుగులో  ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


అలాగే ఈ సినిమా కోసం హీరో రామ్ చరణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటాన్నారు. ‘ధృవ’లో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ కనిపించటం కోసం చరణ్ ఈ విధమైన ఫిట్ నెస్ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ వద్ద ‘ధృవ’ మూవీ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ ఇలా ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు దాదాపు కోటి రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు.


కోటి రూపాయలతో రామ్ చరణ్ తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ మూవీకి ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మంచి వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: