ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం బ్రహ్మోత్సవం. ఈ మూవీకి సంబంధించిన టాక్స్ ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ హాట్ గానే వినిపిస్తున్నాయి. సినిమా చూడలేనంత ఘోరంగా లేనప్పటికీ…చాలా మంది ఈ మూవీపై నెగిటివ్ పబ్లిసిటీని చాలా దారుణంగా క్రియేట్ చేస్తున్నారు. మహేష్ బాబు పై సాధారణ ప్రేక్షకుల్లోనూ అసహనం ఎందుకు మొదలైందో ఎవ్వరికీ అర్ధం కావటం లేదు.


గతంలో ఆగడు మూవీకి సైతం ఈ రేంజ్ లో నెగిటివ్ పబ్లిసిటీ లేదు. కానీ బ్రహ్మోత్సవం మూవీకి మాత్రం వస్తున్న పబ్లిసిటీని చూస్తుంటే, ఇది కచ్ఛితంగా పెద్ద సంఖ్యలో ఓ గ్రూపుగా ఏర్పడి చేస్తున్న నెగిటివ్ పబ్లిసిటీనే కారణం అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు అభిమానులు ప్రముఖ పత్రికపై ధాడికి దిగారు.


ఇందుకు కారణంగా ఆ పత్రిక బ్రహ్మోత్సవం మూవీపై శ్రుతి మించి ఆర్టికల్స్ ని రాయటమే. ప్రతికా విలువలను తుంగలోకి తొక్కి..వారు ప్రింట్ చేసిన బ్రహ్మోత్సవం ఆర్టికల్సే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే, మరో పత్రిక సైతం ఈ విధంగానే రెచ్చిపోయిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. వైజాగ్ లోని ఓ లోకల్ పత్రిక ఇలా చేసినందుకు అభిమానులు సైతం అక్కడ వారి తడాఖ చూపించారని అంటున్నారు. బ్రహ్మోత్సవం మూవీని ఇలా కావాలని టార్గెట్ చేస్తూ రాస్తున్న వారికి అభిమానులు బుద్ధిచెప్పే పనిలో ఉన్నారు.


నిజాన్ని, ఉన్నదిఉన్నట్టుగా రాయాల్సిందిపోయి…కట్టు కథల్ని రాసి ప్రేక్షకులను నమ్మించటం కరెక్ట్ కాదని అంటున్నారు.  అయితే మహేష్ బాబు నిర్మాణరంగంలోకి..బ్రహ్మోత్సవం మూవీతోనే పూర్తిగా అడుగులు వేశారు. బహుశ బయట మార్కెట్ ని ఏ విధంగా చేతుల్లో పెట్టుకోవాలో అనేది తనకి తెలియకనే ఇలా జరిగిఉండొచ్చని కొందరు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: