స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఓ షాకింగ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో సమంత నటించిన చిత్రాలు అన్నీ వరుగా బ్లాక్ బస్టర్ లు అవుతున్నాయి. కానీ తాజాగా వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రం మాత్రం డిజాస్టర్ గా నిలిచిందని అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటీ…అందరూ ఈ మూవీని టాక్స్ తోనే డిజాస్టర్ చేశారు. ఇదిలా ఉంటే, ఇందులో హీరోయిన్ గా నటించిన సమంతకి ఈ ఎపెక్ట్ టచ్ అయిందని అంటున్నారు.


తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో మూవీలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని చర్ఛలు జరిపారు. అయితే అందుకు ఆ టాప్ హీరో మాత్రం సమంతని చివరి నిముషంలో కాన్సిల్ చేయమని అన్నారంట. సమంత అన్నీ సినిమాల్లోనూ ఒకేలా కనిపిస్తుందని, అందులోనూ తనవి ప్రతి రెండు, మూడు నెలలకి ఏదొక సినిమా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. తనలో కొత్తదనం కనిపించటం లేదు. అందుకే కొత్త హీరోయిన్ ని తీసుకోండి అంటూ చెప్పుకొచ్చాడంట.


ఇలా చెప్పిన టాప్ హీరో రామ్ చరణ్ అని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తనిఒరువన్ తెలుగు రిమేక్ లో చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా ఉండనుంది. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. అందులోని భాగంగా ఈ విధమైన టాక్స్ బయటకు వచ్చాయని అంటున్నారు.


మొత్తంగా సమంత పై ఇతర హీరోలు..గతంలో చూపించిన ఆసక్తిని ఇప్పుడు చూపింలేకపోతున్నారని అంటున్నారు. సమంత గ్లామర్ పాత్రలను చేసినప్పటికీ…అవి ఎక్స్ పోజింగ్ రూపంలో ఉండకుండా చేస్తుంది. కానీ ఇతర హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చూపిస్తూ..ప్రేక్షకులను రెచ్చిపోయేలా చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ సమంత పై పడిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: