ఈ మధ్య కాలంలో సినిమాలు ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ముఖ్యం కాదు. రిలీజ్ సమయంలో ఎటువంటి పబ్లిసిటీతో రిలీజ్ చేశామన్నదే అతిముఖ్యమైనదిగా కనిపిస్తుంది. సినిమాని కష్టపడి కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే..తీరా రిలీజ్ అయ్యేనాటికి ఈ మూవీ అట్టర్ ప్లాప్ అంటూ నెగిటివ్ పబ్లిసిటీ ఏర్పడిందంటే చాలు…ఈ ఎఫెక్ట్ కారణంగా ఆ మూవీకి కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది.


అయితే కేవలం నెగిటివ్ పబ్లిసిటి వల్లే సినిమా ప్లాప్ అవుతుందనుకుంటే పొరపాటే. ఎంత నెగిటివ్ పబ్లిసిటి వచ్చినప్పటికీ..సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్ఛితంగా చూస్తారు. అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం ఎంతో కొంత సినిమాపై ప్రభావితం చూపుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు ఈ విధమైన నెగిటివ్ పబ్లిసిటీ కారణంగా చాలా వరకు నష్టపోయాయని అంటున్నారు.


ఇది గమనించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్….తను తెరకెక్కించిన అ..ఆ మూవీ విషయంలో ఇటువంటిది జరక్కుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా..హీరో,హీరోయిన్స్ కి అ..ఆ మూవీ విషయంలో ప్రేక్షకులకి ఓవర్ గా ప్రామిస్ లు చేయవద్దని చెప్పుకొచ్చారు. అలాగే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో అ..ఆ మూవీని ఎక్కడికో లేపొద్దని..సినిమాని అందరూ చూడవచ్చని మాత్రమే చెప్పమని క్లియర్ గా చెప్పాడంట.


అ..ఆ పబ్లిసిటి విషయంలో చాలా క్లిన్ గా వెళ్ళాలని, ఓవర్ ప్రామిస్ లు…పబ్లిసిటిలు చేస్తే…అసలుకే మోసం వస్తుందని నిర్మాతకి సైతం త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడంట. మొత్తంగా నెగిటివ్ పబ్లిసిటి ఎఫెక్ట్ చిత్ర దర్శకులు, హీరోలు, నిర్మాతలని ఓ రేంజ్ లో వణికిస్తుందని ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. వీటిని రిలీజ్ కి ముందుగానే కట్టడి చేయలేకపోతే చాలా కష్టమే అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: