ప్రస్తుత పరిస్థితులలో 30 కోట్ల రూపాలతో నిర్మించిన స్టార్ హీరోకి మూవీకి బిజినెస్ లేక నిర్మాతలు నానా ఇబ్బందులు పడుతుంటే….ఏకంగా 70 కోట్ల రూపాయలతో వస్తున్న సినిమాని చూస్తుంటే…డిస్ట్రిబ్యూటర్స్ హడలిపోతున్నారని అంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభుదేవా, తమన్న కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అభినేత్రి. తమన్న మొదటిసారిగా టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రమే అభినేత్రి గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ విజయ్ దర్శకత్వంని వహిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన రైటర్, దర్శకుడు కోనవెంకట్ సైతం పెట్టుబడులు పెట్టాడు. అయితే 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై డిస్ట్రిబ్యూటర్ ముందు నుండే అనుమాలన్ని వ్యక్తీకరిస్తున్నారు. ప్రభుదేవా, తమన్న ఇద్దరి కాంబినేన్ కి మార్కెట్ లో ఫేమ్ ఉంది కానీ, డిమాండ్ లేదు అని అంటున్నారు.


కేవలం వీరిద్దరిని చూసే సినిమాని కొనాలంటే చాలా కష్టం అని అంటున్నారు. ఇక విజయ్ డైరెక్షన్ అంటే బాగుంటుంది కానీ….మళ్ళీ ప్రభుదేవా,తమన్న అంటేనే అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళు భయపడుతున్నారు. మొత్తంగా 70 కోట్లతో నిర్మితమవుతున్న ఈ చిత్రం, ఎంత వరకూ బిజినెస్ ని చేసుకుంటుంది? అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంత వరకూ ఈ మూవీ సేఫ్ అనేది ప్రశ్నార్ధకరంగా మారింది.


ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను స్టార్ట్ చేశారు. అందులోని భాగంగా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ తరహా డౌట్స్ ని ఎక్స్ ప్రెస్ చేయటంతో నిర్మాతలు ఒకింత షాక్ కి గురైయ్యారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: