తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు..పౌరాణిక,సాంఘికం,జానపద చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు. ఒక దశలో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఈయన వచ్చిన తర్వాత యాక్షన్ సన్నివేశాల్లో కాస్త వెరైటీ వచ్చిందని చెబుతారు..ఫైటింగ్స్ కి కేరాఫ్ అడ్రాస్ కృష్టా అంటారు. అప్పట్లో హాలీవుడ్ కి మాత్రమే సొంతమైన జెమ్స్ బాండ్, కౌబాయ్ చిత్రాలు తెలుగు నటించి మెప్పించిన ఘనత కృష్ణకే దక్కుతుంది. ఇక ఇండస్ట్రీలో వారసుల హవానడుస్తున్న సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రమేష్ బాబు నిర్మాణ రంగంలో ప్రవేశించారు..ఇక మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకు పోతున్నారు. మొదట్లో మహేష్ కి సరైన విజయాలు అందని టైమ్ లో కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’ చిత్రం మంచి ప్లస్ పాయింట్ అయ్యింది.


సూపర్ స్టార్ కృష్ణ


ఈ చిత్రంలో మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత వచ్చిన పోకిరి,అతడు,ఒక్కడు లాంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దూకుడు చిత్రంతో కామెడీ, యాక్షన్ ఓరియెంటెడ్ తో మహేష్ బాబు నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లాడు. గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రంతో సోషల్ మెసేజ్ తో అద్భుత విజయం సాధించారు. అంతే కాదు ఈ చిత్రం 150 కోట్లు వసూళ్లు చేసి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది..ఇక ఇదే ఊపుతు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సం’ చిత్రంలో నటించారు మహేష్.

బ్రహ్మోత్సవం పోస్టర్


 ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రీసెంట్ గా విడుదల కావడం సినిమాపై మిశ్రమ స్పందన రావడం..కొన్ని చోట్ల ఫ్లాప్ టాక్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశకు గురయ్యారు. అయితే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారన్న మీమంసలో ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఒక పెద్ద హీరో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రేక్షకులకు కావాలసిన ఎంట్రటైన్ మెంట్ గురించే ఆలోచిస్తారు..ఒకవేళ ప్రయోగాత్మక చిత్రం అయితే అదో రకంగా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈ చిత్రంలో మహేష్ బాబు ఎలాంటి ఎంట్రటైన్ మెంట్ కి చోటు ఇవ్వకుండా..ఎలాంటి మాల్ మసాలా లేకుండా అభిమానులకు కావాల్సిన థ్రిల్లింగ్ ఫైట్స్ లేకుండా సాదా సీదాగా రోజూ వచ్చే డైలీ సీరియల్ హీరోలా నటించడం ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది.

బ్రహ్మోత్సవం పోస్టర్


అయితే ఈ సినిమా చేసే ముందు మహేష్ బాబు అంచనా వేయలేకపోయడా..? అన్న అనుమానాలు వస్తున్నాయి..ఒకవేళ అంచనా వేసినా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చూస్తారులే అన్న అతి నమ్మకంతో చేశారా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.  ఏది ఏమైనా ఇలాంటి సాదా సీదా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాల్లో నటించి మహేష్  ఫ్యాన్స్ ని మరోసారి నిరాశపరచకుండా ఉంటే బాగుంటుందనుకుంటున్నారు మహేష్ అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: