శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం నిన్న ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓవరాల్ గా బాగున్నప్పటికీ కథ కథనం వల్ల ప్రేక్షకులకు విసుగొచ్చేసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బంధాలు అనుబంధాల నేపధ్యంలో సాగిన ఈ చిత్రంలో చెప్పాల్సింది దర్శకుడు చెప్పలేకపోయాడు. దీంతో సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మహేష్ తన సత్తా చాటుతున్నాడు.


ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్, సమంత, ప్రణీత నటించారు. ఇక సినిమా మొత్తం పెద్ద తారలతో నిండిపోయి సందడిగా ఉందట. మిక్కీజే మేయర్ సంగీతం పెద్దగా ఆదుకోలేక పోయిందని టాక్.ఏది ఏమైనా మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేస్తాడని ఊహించిన వారికి నిరాశే మిగిలిందట. ప్రిన్స్ మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

బ్రహ్మోత్సవం చిత్రం పోస్టర్


బ్రహ్మోత్సవం  ఏరియా వైజ్ కలెక్షన్లు :


నైజాం : 7.12 కోట్లు


సీడెడ్ : 2.82 కోట్లు


గుంటూరు : 2.78 కోట్లు


వైజాగ్ : 2.51 కోట్లు


వెస్ట్ గోదావరి : 2.48 కోట్లు


ఈస్ట్ గోదావరి : 2.40 కోట్లు


కృష్ణా : 1.66 కోట్లు


నెల్లూరు : 0.82 కోట్లు


ఏపీ+తెలంగాణ మొత్తం : రూ.22.59 కోట్లు


ఓవర్సీస్ : 5.20 కోట్లు


కర్ణాటక : 3.30 కోట్లు


రెస్టాఫ్ ఇండియా : 0.96 కోట్లు


టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ : రూ.32.05 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: