ఈ సమ్మర్ రేస్ కు వచ్చిన టాప్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించిన కాజల్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో షాక్ లోకి వెళ్ళి పోయింది. అయితే ఇంత షాక్ లో కూడ ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె కెరియర్ పై రకరకాల కామెంట్స్ చేస్తోంది. తాను సినిమా రంగంలోకి వచ్చి 9 సంవత్సరాలు దాటిపోయినా గత 3 సంవత్సరాల నుంచి సింగిల్ అంటూ ఒక పజిల్ లాంటి సమాధానం ఇచ్చింది కాజల్. 

ఇక తన సినిమాల గురించి అదేవిధంగా తన పెళ్ళి గురించి మాట్లాడుతూ తాను ఎట్టి పరిస్తుతులలోను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోను అని అంటూ ఒక  షాకింగ్  న్యూస్ ను బయట పెట్టింది. భార్యాభర్తలు ఇద్దరిది వేరువేరు వృత్తులు అయినప్పుడు మాత్రమే ఆ పెళ్ళి విజయవంతం అవుతుంది అని అంటూ సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నా అ ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఇదే సందర్భంలో రొమాన్స్ గురించి మాట్లాడుతూ తాను సినిమాలలో మంచి రొమాంటిక్ లుక్స్ లో కనిపించినా నిజజీవితంలో మాత్రం తాను అంత రొమాంటిక్ కాదని మరో షాక్ ఇచ్చింది కాజల్. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ‘ఐ లవ్ యు’ అంటూ సినిమాలో నటించినట్లు తనకు తన భర్తతో నటించడం రాదనీ అందువల్లనే తాను సినిమా రంగానికి చెందిన వాళ్ళను పెళ్ళి చేసుకోను అని చెపుతోంది. 

మూడేళ్ళ నుంచి సింగిల్ అని అంటున్నారు అంతకు ముందు ఎవరోతోనైనా స్నేహం చేశారా అని  మీడియా సంస్థ ప్రతినిధి కాజల్ ను అడిగినప్పుడు మాత్రం తాను గతం గురించి చెప్పను అంటూ తెలివిగా తప్పించుకుంది ఈ హాట్ బ్యూటీ..



మరింత సమాచారం తెలుసుకోండి: