తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఒక్క పవన్ కళ్యాన్ మాత్రమే. కొత్తలో పెద్దగా విజయాలు సాధించకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకున్నా..తమ్ముడు, ఖుషి, జల్సా సినిమాల తర్వాత ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పవన్. తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారే మాస్ ఇమేజ్ పెరిగిపోయింది..అంతే కాదు పవన్ కళ్యాన్ తనదైన మ్యానరీజంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు. ప్రశ్నించడానికి వస్తున్నా అంటూ ‘జనసేన’ పార్టీ స్థాపించి జనాల్లోకి వెళ్లారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్


ఇక తెలుగు రాష్ట్రాల్లో పవనీజం పుట్టుకొచ్చింది...దీంతో పవన్ అభిమానులు జనాల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ఇలా ఇరు రాష్ట్రాల్లో పవన్ అభిమానం ఓ రేంజ్ లో పెరిగిపోతుంటే..ఇప్పుడు ఆ అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నారట యాంటీ పవనీజం సభ్యులు. ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళినా పవర్ స్టార్ అంటూ పవర్ స్టార్ కి భజన చెయ్యడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నప్పట్టికీ ఇన్నాళ్ళు భరించారు కానీ ఇకనుండి ఆ గోల కనిపించకుండా, వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ మద్య బ్లాక్ బ్లస్టర్ ఫంక్షన్ లో బన్నీ మాట్లాడుతున్న సమయంలో పవర్ స్టార్ అంటూ గోల చేయడంతో ‘చెప్పను బ్రదర్’ అనడంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ కావడం..సోషల్ మీడియాలో ఈ విషయం పై పెద్ద దుమారం చెలరేగింది. తర్వాత ‘ఒక మనసు’ చిత్ర ఆడియో వేడుకలో అల్లు అర్జున్..పవన్ కళ్యాన్ కి సారీ చెబుతూనే..ఫ్యాన్స్ కి క్లాస్ పీకారు.

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాన్


చిరంజీవి మెగా కుటుంబానికి పెద్ద అని ఆయన వేసిన పూల బాటలోనే తాము ప్రయాణిస్తున్నామని అలాంటి వ్యక్తి మైక్ పట్టుకొని మాట్లాడితే పవర్ స్టార్..పవర్ స్టార్ అని అల్లరి చేయడం ఎంత వరకు సబబు అని అన్నారు..ఆ సమయంలో చిరంజీవి ఏం చేప్పాలో అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఈ విషయంలో తాను చాలా సార్లు హర్ట్ అయ్యానని అన్నారు. ఈ నేపథ్యంలో  మెగా ఈవెంట్లలో ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతున్న సమయంలో గనుక పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరుస్తే వెంటనే యాంటీ పవనిజం సభ్యులు యాక్టివేట్ అయిపోయి ఆ గోల లేకుండా చేస్తారట.


అల్లు అర్జున్ స్పీచ్


ఇదంతా ఎందుకంటే మెగా ఫాన్స్ లో కొంతమంది గ్రూప్ కట్టి పవనిజం పేరుతో మెగా ఈవెంట్లలో అల్లరి చేస్తుండడంతో వారికి అడ్డుకట్ట వెయ్యాలని భావించారు.పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరుస్తే వెంటనే యాంటీ పవనిజం సభ్యులు వారిని కట్టడి చేస్తారని ప్రచారం జరగడంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ లో ఇలాంటి వివక్షత చూపించడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: