మహేశ్ బాబు తాజా సినిమా బ్రహ్మోత్సవం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా వైఫల్యంపై సోషల్ మీడియాలో కొత్త వాదనలు, విశ్లేషణళు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఆసక్తికరమైన విశ్లేషణ ఏంటంటే.. మహేశ్ బాబు సినిమాను వేంకటేశ్వరస్వామితో పోల్చినందుకేనా బ్రహ్మోత్సవం సినిమా ఫెయిల్‌ అయ్యిందట.?

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో విజయనిర్మల కుమారుడు, హీరో నరేష్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవం సినిమా కలెక్షన్లు తిరుమల వేంకటేశ్వరస్వామి ఏడాది హుండీ ఆదాయాన్నిమించిపోతుంది అని కామెంట్ చేశాడట. కలియుగదైవం, ప్రత్యక్ష దైవం, యావత్‌ ప్రపంచమంతటి నుంచి భక్తులను ఆకర్షిస్తున్న అత్యంత శక్తివంతమైన క్షేత్రం తిరుమల. 

పరకామణితో పొల్చినందుకే ఫెయిల్యూరా.. ?



వందల సంవత్సరాలుగా అతి ఎత్తైన కొండల్లో, దట్టమైన అడవుల్లో ఉన్నాప్రభావాన్ని, ప్రాభవాన్ని చాటుకుంటున్న, సాక్ష్యత్‌ శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నద దివ్యస్థలి. ప్రతి నిత్యం దేవతలు, రుషులు సూక్ష్మరూపులై స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్ మహిమాన్విత ప్రదేశం. అలాంటి తిరుమల శ్రీవారి పరకామణితో పోలికా.. ముడుపు కట్టుకుని, ఏడుకొండలు నడిచివచ్చి వడ్డీకాసులు వాడికి మొక్కు చెల్లించుకుంటారు.

మానవాతీతమైన శక్తితో మనల్ని పోల్చుకుంటే ఉపద్రవాలు తప్పవని.. తిరుమల గురించి మాట్లాడిన వాళ్లు గతంలో ఏమయ్యారో గతంలో చూశామని.. ఇప్పుడు బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ మరో ఉదాహరణ అని కొందరు ఆస్తికులు నెట్లో ప్రచారం చేస్తున్నారు. ఈ వాదనలో ఏమైనా లాజిక్ ఉందంటారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: