సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వస్తున్న తరుణంలో హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సీరీస్ మొదలైంది. జేమ్స్ బాండ్ అనేది ఓ నవల నుంచి పుట్టుకొచ్చిన పాత్ర..దీనిని రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1952 లో సృష్టించాడు. ఈ పాత్రను తన 12 నవలలలోనూ రెండు చిన్న కథలలోనూ ఉపయోగించాడు.1962 లో ప్రారంభమైనప్పటినుండి సినిమా ఫ్రాంఛైజీ గా నేటికినీ పేరొందింది. జేమ్స్ బాండ్ సినిమాలు అత్యంత ఖరీదైన చిత్రాలుగా నిలిచాయి..గూఢాచారి వ్యవస్థపై వస్తున్న ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. గత సంవత్సరం స్పెక్ట్రమ్ చిత్రంతో డేనియల్ క్రెయిగ్ అలరించాడు.

జెమ్స్ బాండ్ పాత చిత్రం


అయితే ఇప్పుడు జేమ్స్ బాండ్ మరో సినిమా తీయాలని ప్రపోజల్ తో  డేనియల్ క్రెయిగ్ సంప్రదించగా చావనైనా చస్తాను కానీ జేమ్స్ బాండ్ చిత్రాల్లో మాత్రం నటించనని డేనియల్ క్రెయిగ్ అనడంతో ఒక్కసారే ఖంగు తిన్నారట..అయినా కూడా అతడే కావాలని అవసరమైతే అతనికి రెండు సినిమాలకు కలిపి 670 కోట్లు ఇస్తామని, రెండేళ్ల సమయం కేటాయించమని అడిగారట.కానీ డేనియల్ నో చెప్పాడు. దీంతో ఇప్పుడు జేమ్స్ బాండ్ కోసం మరో హీరోని ఎంచుకున్నారట.. 35 ఏళ్ల జేమీ బెల్ ని బాండ్ ని చేయాలనుకుంటున్నారట నిర్మాతలు.

జేమ్స్ బాండ్ చిత్రం పోస్టర్


టామ్ హార్డీ, హిడిల్ట్సన్, ఎల్బ్స్ లాంటి గొప్ప గొప్ప నటులు రంగంలో ఉన్నారని ప్రచారం జరిగినా కూడా అనూహ్యంగా బెల్ రంగంలోకి వచ్చాడు. బాండ్ గెటప్ లో ఉన్న హీరో ఆ ఫీల్ తీసుకురావాలని నిర్మాతలు అంటున్నారు. ఇక యాక్టింగ్ పరంగా జేమీకి మంచి పేరే ఉంది. అడ్వెంచర్ ఆఫ్ టింటిన్, కింగ్ కాంగ్, జంపర్ లాంటి సినిమాల్లో నటించాడు.ఆరేళ్ల క్రితం వచ్చిన బిల్లి ఎలియట్ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాదాపుగా ఇతనే ఖాయమయ్యాడని ది ఇండిపెండెంట్, డెయిలీ మెయిల్ పత్రికలు తెలియజేసాయి.


జేమ్స్ బాండ్ చిత్రంలో డేనియల్ క్రెయిగ్ 




మరింత సమాచారం తెలుసుకోండి: