సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం మహేష్ కెరియర్ లోనే డిజాస్టర్ రిజల్ట్ ను ఇచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద మహేష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కాని వాటినన్నిటిని గంగలో కలిపేశాడు దర్శకుడు. సినిమా ఓ సీరియల్ గా సాగింది అన్న వాదనలు గట్టిగా వినపడ్డాయి.


బ్రహ్మోత్సవంలో మహేష్ :


అయితే బ్రహ్మోత్సవం బిజినెస్ పరంగా బాగానే చేసినా వాటిని రాబట్టుకునే మార్గాలన్ని మూసుకుపోయాయని చెప్పాలి. సినిమా మొదటి షో నుండి బ్యాడ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు కూడా ఇష్టపడట్లేదు. అయితే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ లాస్ భరించాల్సి వస్తుంది. అయితే ఈ కారణాలన్ని మహేష్ కు తలనొప్పి తెచ్చుపెడుతున్నాయి. 


సినిమా స్కోప్ ను బట్టి సినిమా అమ్మకుండా రేటు బాగా పెంచి అమ్మడం వల్ల కూడా ఇదో భారీ డిజాస్టర్ గా అయ్యేందుకు కారణమయ్యిందని అంటున్నారు. మహేష్ సినిమాల పట్ల నమ్రత ఎక్కువ చొరవ తీసుకోవడం సూపర్ స్టార్ కెరియర్ కు మంచిది కాదన్నది ఇన్నర్ టాక్. సినిమాలో ఏదో ఒక టెక్నికల్ గా పనిచేస్తే ఓకే కాని ఇలా ఫైనాన్షియల్ ఇష్యూస్ లో వేలు పెడితే జరిగే పరిణామాలకు ఆమె కారణమవ్వాల్సి వస్తుంది. 


బ్రహ్మోత్సవంలో మహేష్, సమంత:


ఇక కెరియర్ బాగుండాలంటే నమ్రతను సినిమా బడ్జెట్, డిస్ట్రిబ్యూషన్ వంటి విషయాలకు తనను దూరంగా ఉంచితే మంచిదని అంటున్నారు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ నమ్రతకు మరి ఓ షాక్ ఇచ్చే తీరుతుంది. సినిమా అమ్మకం విషయాల్లో నమ్రత జోక్యం చేసుకోకుండా చేయాల్సిన బాధ్యత మహేష్ దే అని గట్టిగా చెబుతున్నారు సిని జనాలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: