ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మూవీ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం మూవీ రిలీజ్ తరువాత ఏర్పడిన గంధర గోళం అందరికి తెలిసిందే. కొంత మంది బ్రహ్మోత్సవం బ్లాక్ బస్టర్ అంటుంటే, మరికొంత మంది డిజాస్టర్ అంటున్నారు. ఇవన్నీ కాదు, బ్రహ్మోత్సవం యావరేజ్ అని ఇంకొంత మంది అంటున్నారు. టాక్స్ ఎలా ఉన్నప్పటికీ...జరగాల్సిన నష్టం జరిగింది. ఎప్పుడూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీకి జరగని రచ్ఛ...ఒక్క బ్రహ్మోత్సవం మూవీ విషయంలో జరిగింది.


ఇదిలా ఉంటే బ్రహ్మోత్సవం మూవీ విషయంలో తప్పుడు రాతలు రాసే వారిని మహేష్ ఫ్యాన్స్ ఏరివేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమాని ఉన్నది ఉన్నట్టుగా రాయాలి కానీ, కల్ఫిత కథానాలతో ప్రేక్షకులను తప్పు దోవ పట్టించకుడదనేది వీరి వాదన. అయితే కొన్ని సందర్భాల్లో మహేష్ ఫ్యాన్స్ దాడికి సైతం దిగుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఫ్యాన్స్ కి మహేష్ క్లియర్ గా ఇండికేషన్స్ ఇచ్చాడని అంటున్నారు.


ఎవరైనా ఓవర్ చేస్తే...వారితో మాట్లాడాలి కానీ...గొడవలకు దిగవద్దని చెప్పుకొచ్చాడంట. ఎట్టిపరిస్థితుల్లో ఆవేశానికి లోనుకాకుండా ఉండాలని అంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ అంటూ కొంత మంది ఆకతాయిలు గొడవ చేస్తున్నట్టుగా మహేష్ వద్దకు రిపోర్ట్స్ వచ్చాయి. అటువంటి సందర్భంలో జరుగుతున్నది ఏంటో తెలుసుకోవాలని బాధ్యత కలిగిన అభిమాన సంఘాలకు మహేష్ సూచనలు ఇచ్చాడని అంటున్నారు.


ఇప్పటికీ కొన్ని అభిమాన సంఘాలు వారి పరిధిలో ఉన్న బ్రహ్మోత్సవం సమస్యలను సాల్వ్ చేస్తున్నారు. మొత్తంగా మహేష్ బాబు తీసుకున్న నిర్ణయంలో అభిమానులు ఏ విధంగా ప్రవర్తించాలి? అన్నదానిపై పూర్తి క్లారిటీ వచ్చిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: