టాప్ హీరోయిన్స్ అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆసక్తే..ఎందుకంటే టాప్ హీరోయిన్ తో కలిసి ఉంటే వచ్చే ఆనందం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అందుకే చాలా మంది నిర్మాతలు, హీరోలు, దర్శకులు...టాప్ హీరోయిన్స్ తో రిలేషన్ ని పెట్టుకోవాలని చూస్తుంటారు. టాప్ హీరోయిన్ గా స్టార్ డంని పొందిన తరువాత...ఆ బ్యూటికి అవకాశాలు లేకపోయినప్పటికీ, చాలా మంది ఆమె వెంట పడుతూనే ఉంటారు.


ఆ విధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ తో ప్రముఖ నిర్మాత ప్రస్తుతం రిలేషన్ మెయిన్ టెన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. వాటి వివరాలను చూస్తే...నయనతార ప్రస్తుతం తెలుగులో సినిమాలను చేయలేకపోతున్నప్పటికీ, తమిళంలో మాత్రం టాప్ హీరోయిన్ గా రన్నింగ్ లో ఉంది. పలు క్రేజీ చిత్రాలను తెరకెక్కిస్తూ... ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుంది.


ఇదిలా ఉంటే టాలీవుడ్ కి చెందిన బడా ప్రొడ్యూసర్, ఈ మధ్య కాలంలో నయనతారతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. వీరిద్దరి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా బడా ప్రొడ్యూసర్ తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ కి నయనతార తరుచు లొకేషన్స్ కి వస్తుందని అంటున్నారు. ఈ వ్యవహారంపై నయతనతార సైలెంట్ గా ఉండటంతో....ఈ వార్తలపై టాక్స్ మరింతగా పెరుగుతున్నాయి.


ప్రస్తుతం నయనతార కోలీవుడ్ లో రెండు చిత్రాలను చేస్తుంది. తెలుగులోనూ రెండు ప్రయోగాత్మక చిత్రాలకి సంబంధించిన కథలను వింటున్నారు. మరో నెల రోజుల్లో వీటికి సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ ఓ కొలిక్కి రానున్నాయని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: