పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎస్.జె సూర్య సినిమా స్టార్ట్ చేశాడు.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కు కొంత విరామం ఇచ్చి జాలీ ట్రిప్ కు వెళ్లిన పవర్ స్టార్ వచ్చేలోగా మరో ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడట. 


గబ్బర్ సింగ్ షూట్ లో హరీష్ శంకర్ , పవన్ కళ్యాన్ :


గబ్బర్ సింగ్ టైటిల్ తో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ను కాదని ఇప్పుడు సరికొత్త కథతో హరీష్ పవన్ కు దగ్గరవడం ఏంటని అందరు ఆశ్చర్య పడుతున్నారు. అయితే హరీష్ శంకర్ పవర్ స్టార్ కు దగ్గరవడంలో కీలక పాత్ర వహించింది మాత్రం దిల్ రాజు, ఏ.ఎం రత్నంలట. దిల్ రాజు ఇప్పటికే పవన్ తో ఒక్క ఛాన్స్ అంటూ తిరుగుతుంటే ఏ.ఎం.రత్నం ఆల్రెడీ పవర్ స్టార్ డేట్స్ తీసుకున్నాడు.


సో ఈ ఇద్దరి ప్రమేయంతో హరీష్ శంకర్ పవన్ కు మరోసారి దగ్గరయ్యాడు. ఇక సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత ఏ సినిమా చేయని హరీష్ శంకర్ డైరెక్ట్ గా పవన్ సినిమా చేయడం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే మరో పక్క వినిపిస్తున్న టాక్ ఏంటంటే కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా వేదలం తెలుగు రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాకే హరీష్ శంకర్ ను డైరెక్షన్ చేయమన్నట్టు తెలుస్తుంది.   


గబ్బర్ సింగ్ షూట్ లో పవన్, హరీష్ : 


సో మొత్తానికి మరోసారి గబ్బర్ సింగ్ కాంబో తెర మీద చూడబోతున్నాం అన్నమాట. మరి ఈ హిట్ తో హరీష్ శంకర్ మరోసారి తన సత్తా చాటే అవకాశం ఉంది. ఎస్.జె సూర్య సినిమా కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ సినిమా చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. మరి వచ్చిన ఈ సదవకాశాన్ని హరీష్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: