టాలీవుడ్ లో ఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందో ఎవరు చెప్పలేం.. ఇక ఓ స్టార్ హీరో సినిమాకు పోటీగా ఓ తమిళ డబ్బింగ్ సినిమా నిలబడటం అంటే అదో పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఇంతకీ ఏ సినిమా గురించి మనం మాట్లాడేది అనుకుంటున్నరా అదేనండి బిచ్చగాడి గురించే.. ఏంటి అని షాక్ అవ్వద్దు.. బిచ్చగాడు టాలీవుడ్లో సూపర్ హిట్ అన్నట్టే.


బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోని.. తమిళంలో తను తీసిన ప్రతి సినిమా తెలుగులో ఎంతకో అంతకు అమ్మి రిలాజ్ చేస్తుంటాడు ఈ హీరో కం నిర్మాత. ఆ క్రమమలోనే నకిలి, డాక్టర్ సలీం సినిమాలు వచ్చాయి. కాన్సెప్ట్ బాగున్నా ఆ సినిమాలను పట్టించుకోలేదు. కాని బిచ్చగాడు సినిమా హిట్ కొట్టేశాడు. ఎలాగా అంటే సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల బిచ్చగాడికి కలిసి వచ్చింది.


ఎప్పుడో విక్టరీ వెంకటేష్ తో శీను సినిమా తీసిన శశి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా విజయ్ ఆంటోని హీరో కం ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. అయితే రెగ్యులర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా నచ్చడం విశేషం. సుప్రీం, 24 సినిమా చూసిన ప్రేక్షకులు బిచ్చగాడు సినిమాను కూడా చూసేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బ్రహ్మోత్సవం తీసేసి మరి బిచ్చగాడు వేశారంటే నమ్మాలి.


సో అలా తన సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్. ఇక మరో విశేషం ఏంటంటే తెలుగులో ఇంత పెద్ద విజయం సాధిస్తుంది అని తెలియకుండా అర కొరగా ఈ సినిమా తెలుగు రైట్స్ ను అమ్మేశాడట. సో ఈ లెక్కన బిచ్చగాడు తెలుగు రైట్స్ వారికి ఈజీగా 2 కోట్ల షేర్ వచ్చి ఉంటాయని అంటున్నారు ఏది ఏమైనా టైటిల్ వరకే బిచ్చగాడు సినిమా మాత్రం కుబేరుడు అని చెప్పాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: