ఈ సమ్మర్ ఓ విధంగా ప్రేక్షకులకు ఓ రకంగా అన్ సాటిస్ ఫ్యాక్షన్ గా మిగుల్తుదనే చప్పాలి. చక్కగా కుటుంబం మొత్తం చూసే సినిమా ఏది లేక పోవడం కాస్త నిరాశ చెందారు ఆడియెన్స్. అదెలా అంటే సరైనోడు సూపర్ హిట్ అయినా అదంతా బోయపాటి మార్క్ మాస్ సినిమాలానే మిగిలింది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన సర్దార్ ఫ్లాప్ అయితే.. బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.


సో ఈ సమ్మర్ కు ప్రేక్షకులు ఎలా అని ఫీల్ అవుతున్న సందర్భంలో త్రివిక్రం సెల్యులాయిడ్ నుండి అఆ సినిమా వస్తుంది. నితిన్ సమంత జంటగా నటించిన ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అవుతుంది. ఓ విధంగా ఫ్యామిలీ ఆడియెన్స్ దాహం తీర్చే సినిమా ఇదే అవుతుందని చెప్పొచ్చు. నితిన్, సమంతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు.


కేవలం వారు మాత్రమే కాదు పరిశ్రమ పెద్దలు కూడా ప్రస్తుతం ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రం కెరియర్లో ఒక్క ఖలేజా తప్పించి అన్ని సూపర్ హిట్ సినిమాలే అందించాడు. కాబట్టి ఈ అఆ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుంది. ఓ పక్క నితిన్ ఫ్లాపుల్లో ఉన్నా సరే ఈ సినిమా తనని కూడా గట్టేక్కిస్తుందని నమ్ముతున్నాడు. 


ఇక త్రివిక్రంతో వరుసగా సినిమాలు చేస్తున్న సమంత ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉంది. సో అందరు అనుకున్నట్టుగా సమ్మర్ సూపర్ హిట్ సినిమా అఆ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి సినిమా ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే జూన్2 దాకా వెయిట్ చేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: