త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ లమధ్య సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. టాలీవుడ్ లో ఎవరితోనూ పెద్దగా సన్నిహితంగా ఉండని పవన్ త్రివిక్రమ్ విషయంలో మాత్రం చాల భిన్నంగా ఉంటాడు. వీరి కాంబినేషన్ తో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరి సాన్నిహిత్యం మరింత బలపడింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ తరువాత ప్రస్తుతం ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న పవన్ ఆ సినిమా విషయాల పై దృష్టి పెడుతూనే తనతో ఓ సినిమా చేయమని పవన్ త్రివిక్రమ్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. 

ఎస్.జె. సూర్యతో చేస్తున్న సినిమాను మూడేమూడు నెలల్లో ఫినిష్ చేసి ఫ్రీ అయిపోతానని తన డేట్స్ రెడీ అని త్రివిక్రమ్ కు పవన్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా అలాగే ఈ సినిమాను నిర్మించబోయే  బ్యానర్ కూడా త్రివిక్రమ్ ఛాయిస్ కే వదిలేస్తానని పవన్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు టాక్.  అయితే ఇలా పవన్ త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచడానికి రెండు కారణాలు ఉన్నాయి అని అంటున్నారు. 

వీరిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్ కు మరోసారి తెర తీయడంతో పాటు ‘సరైనోడు’ సక్సస్ తరువాత అల్లుఅర్జున్ చేయబోయే దర్శకుల లిస్టులో లింగుస్వామి, విక్రమ్ కుమార్ లు రెడీగా ఉన్నా బన్నీ చూపులు మాత్రం త్రివిక్రమ్ పై ఉన్నాయి అనే వార్తలు వస్తూ ఉండటంతో త్రివిక్రమ్ ఎట్టి పరిస్తుతులను బన్నీ వైపు వెళ్ళిపోకుండా  ముందుగానే వ్యూహాత్మక ఎత్తుగడతో పవన్ త్రివిక్రమ్ ను కార్నర్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడ ఉన్నాయి. 

ఇది ఇలా ఉండగా ‘అ ఆ’ సినిమాను నిర్మించిన రాధాకృష్ణ త్రివిక్రమ్ సూర్యల కాంబినేషన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అని టాక్. దీనికి కారణం ఈ మూవీ ప్రాజెక్ట్ కు భారీ బడ్జెట్ ఒక కారణం అయితే ఈ మూవీ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అన్న ఉద్దేశ్యం కూడ నిర్మాత రాధ కృష్ణకు ఉంది అని అంటున్నారు. ఈ కారణాల రీత్యా ‘అ ఆ’ విడుదల అయిన తరువాత త్రివిక్రమ్ రాధ కృష్ణ నిర్మాణంలో వచ్చే సంవత్సరం మొదట్లో పవన్ సినిమాకు శ్రీకారం చుట్టినా ఆశ్చర్యం లేదు అనే వార్తలు విని పిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా పవన్ ఒత్తిడిలో త్రివిక్రమ్ ఆలోచనలు ఉన్నాయి అని అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: