మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన ‘పోకిరి’ కలక్షన్స్ రికార్డులను ఆ తరువాత వచ్చిన మహేష్ సినిమాలు బ్రేక్ చేసినా మహేష్ కు ‘పోకిరి’ సినిమా ఇచ్చినంత క్రేజ్ మరే సినిమా ఇవ్వలేదు అన్నది వాస్తవం. మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రహ్మోత్సవం’ సూపర్ ఫ్లాప్ గా మారడంతో ఇప్పుడు మహేష్ ఆశలు అన్నీ మురగ దాస్ సినిమా పైనే ఉన్నాయి. 

దాదాపు 80 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాషలలో  రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మురుగుదాస్ స్టైల్ లో స్ట్రాంగ్ సోష‌ల్ మెసేజ్ ఉంటుంద‌ని  అంటున్నారు. అయితే ‘బ్ర‌హ్మోత్స‌వం’నిరాశ‌ప‌ర‌చ‌డంతో మ‌హేష్ మురుగుదాస్ మూవీకి సంబంధించిన బడ్జెట్ విషయమై చాల శ్రద్ధ తీసుకోవడమే కాకుండా ఎట్టి పరిస్థుతులలోను ఈసినిమాను డిసెంబర్ కు పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో మహేష్ ఉన్నట్లు టాక్. 

ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కు పూర్తి అయినా వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు ఈసినిమాను విడుదల చేయాలని భావిస్తూ ఉండటంతో ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను ఏప్రియల్ లో మాత్రమే విడుదల చేయమని మహేష్ పట్టుపట్టి మరీమరీ మురగదాస్ కు చెపుతున్నట్లు టాక్. దీనికి కారణం మహేష్ కు బలపడిన మే సెంటిమెంట్ అని అంటున్నారు.

ప్రస్తుతం మే నెల‌ పేరు వింటేనే అదిరి పోతున్నాడు అబూ టాక్. గతంలో మహేష్ నటించిన ‘నిజం’ ‘నాని’ సినిమాలతో పాటు లేటెస్ట్ గ నటించిన ‘బ్ర‌హ్మోత్స‌వం’ ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో భవిష్యత్ లో మహేష్ తాను నటించే ఏ సినిమాలు  మే నెలలో విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థిరమైన నిర్ణయం మహేష్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మురగదాస్ మహేష్ ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రియల్ 28న తన ‘పోకిరీ’ సెంటిమెంట్ తో రిలీజ్ చేసి తిరిగి తన హావను చాటాలని మహేష్ దృఢ నిశ్చయంలో  ఉన్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: