మంచినటుడిగా అతితక్కువ కాలంలో పేరుతెచ్చుకున్న నాగశౌర్య పేరు ఈమధ్య తరుచు ఏదో గాసిప్పులలో వినిపిస్తూనే ఉంది. టాలీవుడ్ లవర్ బాయ్ ఇమేజ్ తో స్పీడ్ గా సినిమాలు చేస్తున్న నాగశౌర్య  లేటెస్ట్ గా ‘ఒక మనసు’ సినిమాలో హీరోగా నటిస్తున్నా ఆ సినిమా పేరు చెప్పగానే అందరికీ నిహారిక మాత్రమే గుర్తుకు రావడంతో మీడియా కూడ ఇది నిహారిక సినిమాగానే గుర్తిస్తోంది. 

ఈమధ్యనే పాటలు విడుదల అయి విడుదలకు సిద్దం అయిన ఈసినిమాలో హీరోయిన్ గా నిహారిక నటిస్తూ ఉండటంతో ఆమె మెగా కుటుంబం నేపథ్యం బ్యాకింగ్ తో సహజంగా ఇది మెగా డాటర్ సినిమా గానే  మారిపోయింది. దీనికితోడు ఇటీవల జరిగిన అడియో ఫంక్షన్ మొత్తం నీహారిక మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లా కనిపించింది తప్ప అందులో నాగశౌర్య హీరో అని అతగాడి సినిమా ఫంక్షన్ అని ఎక్కడా అనిపించలేదనే  టాక్ ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఇదే విషయం నాగశౌర్యను ఫీల్ అయ్యేలా చేస్తోందని  టాక్. ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక ఛానెల్ గేమ్ షోకి నాగశౌర్య ను గెస్ట్ గా రావాలని కాంట్రాక్ట్ చేస్తే సింగిల్ గా రమ్మంటే వస్తానని, హీరోయిన్ నిహారిక వస్తే తను రానని చెప్పినట్లు టాక్. దానితో  ఏమిచేయాలో తోచక ఆ గేమ్ షో నిర్వాహకులు సైలెంట్ అయి పోయినట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఈ యంగ్ హీరో మాత్రం నిజంగా ‘ఒక మనసు’ సక్సస్స్ అయినా తనకు ఏమి కలిసి వస్తుంది అన్న ఆలోచనలో ఉన్నట్లు గాస్సిప్పులు వస్తున్నాయి. జూన్ 24న విడుదలకు రెడీ అవుతున్న ఈసినిమా విడుదల తరువాత మాత్రమే నాగశౌర్య భయాలు ఎంతవరకు నిజం అన్న విషయమై ఒక క్లారిటీ వస్తుంది. ఏమైనా నిహారిక క్రేజ్ ఒక విధంగా నాగశౌర్యను భయ పెడుతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: