తెలుగు చలన చిత్రసీమలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన నటసార్వభౌములు నందమూరి తారక రామారావు అంటే తెలుగు అభిమానులకు ఎంతో ఇష్టం. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో ఆయన నటించని పాత్రలంటూ ఏవీ లేవు..పౌరాణికం,జానపదం,సాంఘీకం ఇలా అన్ని రకాల పాత్రలు ఆయనకోసమే సృష్టించినట్లు ఉండేవి. ఇక ఎన్టీఆర్ వారసులుగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు. మంచి మాస్ ఫాలోయింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్


ఇక ఈయన తర్వాత తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే పౌరాణిక పాత్రలో నటించి షెబాష్ అనిపించుకున్నాడు. తర్వాత స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు పొందాడు. గత సంవత్సరం టెంపర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది..ఇదే ఊపుతో సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా 50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొరటాల శివ


ఇక ఈ నెల 28 న ఎన్టీఆర్ జయంతి సందర్భం గా ప్రతి ఏటా ఘాట్ ను సందర్శించుకునే ఎన్టీఆర్ ఈ సారి రెండు రోజుల ముందే ఆయనకు నివాళులు ఘటించారు..కారణం అదే రోజున చెన్నై లో జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఉంటారు. ఎన్టీఆర్ తో పాటు జనతా గ్యారేజ్ దర్శకులు కొరటాల శివ, నిర్మాతలు యలమంచిలి రవి మరియు మోహన్ సి వి ఎమ్ లు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: