సినిమాల్లో వాడే వస్తువులకు సూపర్ డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో వాడే వస్తువులను.. వారి వేసుకున్న డ్రెస్ లను వేలం వేస్తే భారీ రేంజ్ లో కొంటారు అభిమానులు. అయితే అమితాబ్ తీన్ సినిమాలో వాడిన ఓ స్కూటర్ ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. తీన్ సినిమాలో అమితాబ్ వాడిన బ్లూ కలర్ స్కూటర్ ఓ స్కూటర్ మెకానిక్ దగ్గర అద్దెకు తీసుకున్నారు. రిబు దాస్ గుప్త ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.


తీన్ సినిమాలో అమితాబ్ :


షూటింగ్ అన్ని రోజులు దాన్ని వాడేసి అతనికి డబ్బులు ఇచ్చారు. అయితే ఆ సినిమాలో స్కూటర్ కీలకం కావడంతో ఆ స్కూటర్ కు కూడా భలే క్రేజ్ ఏర్పడింది. సుజిత్ నారాయణన్ ఓ స్కూటర్ వ్యాపారి. అయితే తీన్ దర్శకుడు అనుకున్న కథ ప్రకారం బ్లూ కలర్ స్కూటర్ బాగా నచ్చడంతో ఆ స్కూటర్ ను వాడేందుకు తనకు రెంట్ పే చేశారట. 


ఇక సినిమాలో వాడిన స్కూటర్ డిమాండ్ పెరగడం మాములే. సో ఇప్పుడు ఆ స్కూటర్ కు కోటి రూపాలిస్తామని అంటూ బేరాలొస్తున్నాయట. అయినా కాని అతను అమ్మను అనడం విశేషం. 13 ఏళ్ల క్రితం కొన్న ఆ స్కూటర్ తనకు ఎంతగానే నచ్చిందని.. ఇక అమితాబ్ వాడే సరికి తనకు దాని మీద ఇంకా ప్రేమ పెరిగిదని అన్నాడు ఆ స్కూటర్ యజమాని.


తీన్ సినిమాలో స్కూటర్ పై అమితాబ్ : 


సో మొత్తానికి స్కూటర్ అంత రేటు పలుకక పోయినా కోటిచ్చినా స్కూటర్ ఇవ్వను అని చెప్పడంలో తనకు ఆ స్కూటర్ మీద ఉన్న ప్రేమను తెలియ పరిచాడు సుజిత్ నారాయణన్.. మరి ఆ స్కూటర్ మళ్లీ మళ్లీ సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సో మొత్తానికి అలా స్కూటర్ హంగామా బాలీవుడ్ లో భలే జోరు కొనసాగిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: