‘బ్రహ్మోత్సవం’ సూపర్ ఫ్లాప్ తరువాత ఆ షాక్ నుండి తేరుకోవడానికి రెండు రోజుల క్రితం లండన్ వెళ్లేముందు మహేష్ తనను కలిసిన కొందరు సన్నిహితులు మీడియా మిత్రులతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పై ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ నేపథ్యంలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలను తప్పు పట్టవద్దని మహేష్ కామెంట్ చేసినట్లు టాక్. 

తన ఫ్యాన్స్ ను కూడ ఇలాగే కోరుతున్నానని మహేష్ కామెంట్స్ చేయడమే కాకుందా ఈ సినిమా ఫెయిల్యూర్ కు తనకు కూడ భాద్యత ఉందని క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు ఈసినిమాకు దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాలను తీసుకోమని తానే సూచించానని అందువల్ల శ్రీకాంత్ అడ్డాలను విమర్శించడంలో అర్ధం లేదు అని మహేష్ కామెంట్ చేసినట్లు టాక్. 

గతంలో ‘ఆగడు’ ఘోర పరాజయం చెందినప్పుడు మహేష్ ఫ్యాన్స్ శ్రీను వైట్లను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నప్పుడు కూడ ఇదేవిధంగా మహేష్ శ్రీనువైట్లకు బాసటగా నిలిచాడు. అంతేకాదు ఒకసినిమా నిర్మాణం సమిష్టి కృషి అని చెపుతూ కేవలం ఒక దర్శకుడును టార్గెట్ చేయడం సమంజసం కాదు అంటూ అప్పట్లో కామెంట్ చేసాడు మహేష్. 

మహేష్ చాల దూర దృష్టితో ఆలోచించి ఏ దర్శకుడుతోను బహిరంగంగా వైషమ్యాలు పెంచుకోడు. అంతేకాదు తన ఇంటి చుట్టూ దర్శకులను తిప్పుకునే అలవాటు కూడ మహేష్ కు లేదు అని అతడి సన్నిహితులు అంటూ ఉంటారు. అందువల్లనే టాప్ దర్శకులు అంతా మహేష్ తో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపుతూ ఉంటారు. శ్రీకాంత్ అడ్డాలకు మహేష్ బాసటగా నిలిచాడు కాబట్టి ఇక అతడి పై మహేష్ అభిమానుల కోపం చల్లారుతుందని భావిద్దాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: