తమిళ ఇండస్ట్రీల ఎవరగ్రీన్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ అటే అక్కడే కాదు యావత్ భారత దేశంలో మొత్తం అభిమానులు ఉన్నారు..అంతే కాదు ఆయన అభిమాను ఎల్లలు కూడా దాటింది. అమెరికా,మలేషియా,సింగపూర్,జపాన్ దేశాల్లో రజినీకాంత్ వీరాభిమానులు ఉన్నారు. తాజాగా రజినీకాంత్ నటిస్తున్న కబాలి చిత్రం తర్వాలో విడుదల కాబోతుంది.  ‘కబాలి’ చిత్రం విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ ఆయన అభిమానుల్లో ‘కబాలి ఫీవర్‌’ పెరిగిపోతూనే ఉంది. మలేషియా, సింగపూర్‌ వంటి దేశాల్లో అయితే ఇదివరకు లేనంతస్థాయిలో అభిమానులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

దక్షిణ భారతదేశంలో మాదిరిగా, ‘కబాలి’ టీషర్టులు, కార్లపై పెద్దస్టిక్కర్లు, ఫ్లెక్సీలు.. ఇలా తమ అభిమానాన్ని మరింత చాటుకుంటున్నారు. సాధారణంగా  రజినీకాంత్ చిత్రం అంటే తమిళ తంబీలకు పండుగ వాతావరణమే. రజినీ సినిమా వస్తుందటే వారం రోజుల నుంచి థియేటర్ల వద్ద పెద్ద హంగామా నెలకొంటుంది. ఇక సినిమా రిలీజ్ రోజు స్వీట్లు పంపకం, కటౌట్స్ కి పాలాభిషేకాలతో చాలా కోలాహలంగా ఉంటుంది.  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మాఫియా నేపధ్యంతో కబాలి అనే సినిమా చేస్తోండగా ఈ చిత్రానికి పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి టీజర్  రికార్డుల మోత మోగించింది.  కబాలి చిత్రం జూన్‌ తొమ్మిదిన ఆడియో విడుదల కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నాం.

 ఈ సినిమా పాటల భారీ ఎత్తున ఫంక్షన్ జరిపించి.. విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పాటల విడుదల వేడుకను చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇక తెలుగు పంపిణీ హక్కులు భారీ ధరకు అభిషేక్ పిక్చర్స్ సొంతం జరిగినది. అభిషేక్ పిక్చర్స్ ఆంధ్ర నైజాం ఏరియా హక్కులను కైవసం చేసుకుంది. ఎన్ వి. ప్రసాద్ సీడెడ్ హక్కులు పొందారు. కబాలిలో అండర్ వరల్డ్ డాన్ గా రజనీ నటిస్తుండగా, ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తుంది. ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: