మెగా స్టార్ చిరంజీవి పర్సనల్ జీవితం లో ఒక మాయని మచ్చగా ఉండిపోయింది ఆయన కూతురు శ్రీజ పెళ్లి వ్యవహారం. శిరీష్ భరద్వాజ్ తో అప్పట్లో ఇంట్లోంచి వెళ్ళిపోయి సొంత తండ్రి , మెగాస్టార్ చిరంజీవి మీదనే కేస్ పెట్టిన ఆమె ఇప్పుడు మరొక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండవ వివాహం చాలా ఘనంగా సాంప్రదాయ బద్ధంగా చేసారు శ్రీజ తల్లి తండ్రులు. ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ కొడుకు కళ్యాణ్ ని వరుడుగా పొందిన శ్రీజ కొన్ని నెలల క్రితం శిరీష్ కి అఫీషియల్ గా విడాకులు ఇచ్చేసి తన కూతురు తో సహా పెళ్లి కి సిద్దం అయ్యింది. ఈమె పెళ్లి జరగడానికి ముందరే చిరంజీవి కి ఆపోజిట్ అయిన బీజేపీ పార్టీ లో జేరిన శిరీష్ ఇప్పుడు శ్రీజ కి పోటీగా మరొక పెళ్లి కి సిద్దం అవుతున్నాడు అని తెలుస్తోంది.

 

అతనొక బడా పారిశ్రామిక వేత్త కూతురికి మూడు ముళ్ళు వెయ్యబోతున్నాడు అని టాక్ నడుస్తోంది. ఈ నెలాఖర్లో అతని పెళ్లి ఉంటుంది అని అతని బంధువుల దగ్గర చెప్పాడట భరద్వాజ్. శ్రీజ కంటే ముందరే ఆమెకి పోటీగా ఒక అమ్మాయిని పెళ్ళాడడానికి శిరీష్ భరద్వాజ్ అడుగులు వేసాడు అని కానీ అది సాధ్యపడలేదు అని గతం లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త అయినా నిజమా లేదా అనేది మరొక నాలుగు ఐదు రోజులలో తెలిపోనుంది. శ్రీజ కి ఆమె ఫ్యామిలీ కీ షాక్ ఇస్తూ శిరీష్ ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని శిరీష్ తల్లి తండ్రులు సైతం కోరుకుంటున్నారు అని సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: