కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు,

పేర్లకీ, పుకార్లకీ, పకీర్లకీ నిబద్ధులు,

నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు,

తాతగారి, బామ్మగారి భావాలకు దాసులు.

శ్రీ. శ్రీ.

(మహాప్రస్థానం)

 

 

యువత జాతి సంపద. అత్యధిక శాతం యువత ప్రజల్లో వర్ధిల్లిన రోజుల్లోనే, ఆ దేశ అభివృద్ది గణనీయంగా ఉంటుంది.అది అమెరికా అయినా, జపాన్ అయినా, చైనా అయినా. ఇప్పుడు ఇండియా టర్న్. ఇండియా యువశకంతో, యువశక్తి తో వర్దిల్లితుందిప్పుడు. 30% యువ జనాభా ఉన్న యువభారతం గురించి ఇప్పుడు చెప్పేది జనాబా విద్య గురించి కాదు. సంఖ్య గురించి కాదు. ఇప్పుడు మాట్లాడేది యువశక్తి క్వాలిటి గురించి.

 

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రొద్దున నిద్ర లేచినప్పటినుండి అర్ధ రాత్రి పోలీసులొచ్చి మందు-షాప్ మూయించే వరకు దాని ప్రాంగణం ముందూ రోడ్ పైనా కూడా నిండేది మనయువతే. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కూడా అన్నీ రకాల మత్తు పదార్ధాలను ఆస్వాదించేదీ యువతే. ఈ పెడ దోరణలను నివారించే సంస్కారాన్ని బోధించటము లేదిక్కడ. ఒక్కటే విషయం ... మీరు యువకులు, యువశక్తితో పర్వతాలను పిండిచేయగల సామర్ధ్యం మీకుంది. తాజ్-మహళ్ళను కట్టగలిగే నైపుణ్యం, నాగార్జున సాగర్లను నిర్మించే నేర్పు, విశ్వనగరాలను నిర్మించే సామర్ధ్యమే… కాదు,  ఐ.టి ని ఔపాసన పట్టగల  ఔన్నత్యం కూడా భారతీయులదే.

 

అయితే మీరు కనీసం వినొదాన్ని విభేదాలు లేకుండా ఆనందించలేరా? ఆ ఆనందాన్ని మీకు, మీ కుటుంబానికి, మీ ఊరికి, మీ అభిమాన కథానాయకునికి మాత్రమే పరిమితం చేస్తారా? మీకు అభిమాన కథానాయకుడు ఒక్కడేనా? రోజు ఒకే కూర తింటారా? రకరకాల కథా నాయకులిచ్చే రకరకాల వినోదాలు వద్దా? ఒకే నాయకుని సినిమా చూస్తూ ఆ చప్పిడి కూడు ఎన్ని రోజులు చూస్తారు?  ఒకే నట కుటుంబానికి వీర విధేయులై ఎన్నాళ్ళు చస్తారు?

 

యువతకు, మరీ మాట్లాడితే ఒక యువకునికి - విభిన్న సంస్కృతులను, భాషలను, సంస్కారాలను, ఆరాదించే సమన్వయం కావాలి.  వినోదాన్ని కాని, విలక్షణతని కాని గుర్తించ గల నైపుణ్యం, నేర్పు కావాలి. ఎందరి నైనా వారిలోని విలక్షణతను గుర్తించి ఆరాధించే ఒక విశ్వ ఆరాధకులైన యువత మనకవసరం. 

 

మీరు ఈ వ్యక్తి, కుటుంబ, వ్యవస్థ, పార్టీ, కుల, మత, లింగ, ప్రాంత, రాష్ట్ర, దేశ, ఖండ విదేయత లను బానిసత్వాలను వీడి బ్రతకలేనప్పుడు వీరు యువకులు కారు. పుట్టుకతో వృద్ధులు. సిగ్గుమాలి చేవ చచ్చిన చేతకాని సన్యాసులని చెప్పటానికి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ.శ్రీ) గారే కాదు, మీలో సంస్కారమున్న, బానిస బుద్ధులు లేని ఏ యువకుడైనా చాలు. పవన్ దుర దృష్టమేమిటో గాని ఆయన అభిమానులే ఆయన్ని అనంత సమస్యల్లోకి త్రోసేస్తున్నారు. మంచీ లేదు చెడూలేదు, ఎవడైనా ఎక్కడైనా తమ హీరోని పొగడకుండా, ఆ పొడ లేకుండా కార్య క్రమా న్ని సాగనివ్వరు. అది సినిమా ప్రారంభమైనా, ఆడియో రిలీజైనా, టీజర్ రిలీజ్ గాని, ట్రైలర్ రిలీజ్ గాని, చివరకు చిరంజీవి పుట్టిన రోజు కాని పవన్ అంటూ పవన్ గురించి మాట్లాడమంటూ మైండ్గేం ఆడుతూ వత్తిడి చేస్తారు. అవసరమైతే ఆయన పరువు తీస్తారు.

 

1996 లో సినిమా రంగములో ప్రవేశించి రెండు దశాబ్ధల కాలం పాటు నటించిన సినిమాలు, 20 కి మించి తెలుగులో ఉండవు. ఇందులోను నిర్మాతలను నష్ట పరచి  వైఫల్యమైన సినిమాలే ఎక్కువ.   50% వైఫల్యమైన సినిమాలే ఎక్కువ. 50%  సినిమా లే విజయవంతమయ్యాయి. “రెండు సినిమాలు మాత్రమే ఇండస్ట్రీ హిట్”  సాధించాయి.

 

 “పునాదిరాళ్ళు” వేసిన కథానాయకుడికి ఎంత విలువివ్వాలి?.  చిత్ర రంగములో ప్రవేసించి తొలి రోజు ల్లో అడుగడుగు అవ మానాలు, ఆకలి కడుపులతో రోజుల కొద్దీ మాడి, రాత్రనకా పగలనకా కష్టపడి నూతన నట వైభవాన్ని తెలుగు సినిమా కు పరిచయం చేసి, నాటి అగ్ర కథానాయకుల కంటి కే కునుకు రాకుండా చేసిన చిరంజీవి కి బ్రహ్మరథం పట్టరా? ఆయన జన్మదినోత్సవ సభలో ఆయన్ని ఆశీర్వదించక,  దేవుని ఆయనకు నూరేళ్ళ ఆయుష్షు నివ్వమని కోరకుండా, ఆయన్ని పవన్ కళ్యాణ్  గురించి చెప్పమనటం ఏమి న్యాయం? పవన్ అభిమానులు ఇంత కు-సంస్కారులా? ఆ క్షణాన  చిరంజీవి మనసు ఎంత వికలమైందో ఊహించని, తగని  మానసిక ప్రవృత్తిని "మాస్-హిస్టీరియా లాగా వారికి జబ్బేమైనా తగులుకుంద" ని ఊరకుండాలా? అయినా అన్న, (అమ్మలో "అ" - నాన్నలో "న్న" అమ్మా. నాన్న తానే ఐన "అన్న") కదా?

 

కనీసం సంఘం లో ఈ కుటుంబం నుండి ఒక డజను వరకు కుటుంబ నటులు ఉద్భవించటానికి ఆయన కు అగౌరవం తెచ్చే అభిమాను లను అందించటానికే నా అపకీర్తి మోయటానికేనా చిరంజీవి జన్మించింది?   దీన్ని అభిమానం అందామా? దీనికి దురభిమానం అనికూడా అనలేము అంటే దురభిమాని కూడా, తన అభిమాని అభివృద్ధికి మూలమైన వ్యక్తిని గౌర విస్తారు. కొత్తగా ఈ అభిమానానికి నామకరణం చేద్ధామా? ఏది ఏమైనా పవన్ నామస్మరణతో కొంతమందికి ఆనందంగా ఉండోచ్చుకాని చాలా మంది హర్ట్ అయిన సందర్భాలే ఎక్కువ ఉన్నట్లు ఆ మద్య ఓ ఫంక్షన్లో బన్ని బహిరంగానే చెప్పారు. 

 

కొందరు కీటక సన్యాసులు చేసే తలనొప్పికి మెగాకుటుంబం ఇబ్బంది పడాలా? అనేక సమస్యలు సృష్టించిన ఈ అభిమానుల చరిత్ర ఇక్కడ రాయాలంటే ఒక ఉద్గ్రంధమే అవుతుంది. అందుకే ఒక ఉదాహరణనే తీసుకోవలసి వచ్చింది.  నిజమైన పవన్ అభిమానులైతే పవన్ ను ఒక మాట, ఒక బాణం, ఒక భార్య తో ఉండమనండి-

 

ఒక మాట:  తెలుగు జాతికి పవన్ ఒక మాటిచ్చాడు. పని చేయని వాళ్ళని ప్రశ్నిస్తానని ఒక్క ప్రశ్నకూడా, చంద్రబాబుని గాని- నరేంద్ర మోడీని గాని ప్రశ్నించాడా?

ఒక బాణం:  రాజకీయ ఆయుధమైన జనసేన ను ఒక సారి కూడా ఉపయోగించక తెలుగు దేశం పార్టీకి మద్దెల వేయట మెందుకు?

ఒక భార్య:  ఇది జనానికి అవసరం లేదు; కాని ఆయన నిబద్ధతకు, నిజాయతీ కి కొలమానం మాత్రమే.

 

నిజమైన  “పవన్  (దుర) అభిమానుల” ను మాత్రమే - "యాంటీ పవనిజం సభ్యుల సంఘం” ముందు ముందు ప్రశ్నించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: