‘అ ఆ’ హిట్ అయితే తిరిగి ట్రాక్ లోకి వద్దామని ఎన్నో ఆసలు పెట్టుకున్న నితిన్ ఈ సినిమా ప్రమోషన్ ను ఈరోజు నుంచి ప్రారంభించాడు. అయితే ప్రమోషన్ మొదలు పెట్టిన మొదటిరోజే నితిన్ కు సమంత విషయంలో మీడియా ముందు కార్నర్ అవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈరోజు మీడియా ప్రతినిధులతో తన ‘అ ఆ’ గురించి మాట్లాడుతున్న నితిన్ కు మధ్యలో సమంత పై మీడియా ప్రశ్నలు వేయడం ఈ యంగ్ హీరోకి అనుకోని తలనొప్పిగా మారింది అని టాక్. 

కొద్ది రోజుల క్రితం సమంత తాను టాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ హీరోను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాను అని చెప్పడమే కాకుండా ఆ యంగ్ హీరో బాగా వంటలు చేస్తాడు అని కూడ సెటైర్ వేసింది. దీనితో ఒకేసారి ఎలర్ట్ అయిన మీడియా ఆ యంగ్ హీరో ఎవరు అనే విషయం పై రకరకాల ఊహగానాలు చేస్తూ గాసిప్పులు కూడ వ్రాస్తోంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం నితిన్ వద్దకు చేరింది. 

‘అ ఆ’ సినిమా గురించి మాట్లాడుతున్న నితిన్ మాటలకు అడ్డు వచ్చిన ఒక మీడియా ప్రతినిధి సమంత పెళ్ళి చేసుకోబోతున్న ఆ యంగ్ హీరో ఎవరు అంటూ నితిన్ ను ప్రశ్నించాడు అని టాక్. అనుకోని ఈ ప్రశ్నకు షాక్ అయిన నితిన్ వెంటనే తేరుకుని ఈ వ్యవహారంలో తనను లాగ వద్దని ఈ ప్రశ్నను డైరెక్టర్ సమంతను అడిగితే బాగుంటుందని అంటూ తెలివిగా తప్పించుకున్నాడు అని తెలుస్తోంది.

అయితే మీడియా ప్రతినిధులు సమంత వ్యవహారం పై మరింత రెట్టించడానికి నితిన్ వద్ద ప్రయత్నిస్తూ ఉంటే నితిన్ ‘అ అ’ సినిమా విషయాలలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మీడియా వర్గాలు సమంత చేత ఎదో విధంగా ఆ అజ్ఞాత హీరో ఎవరూ అనే విషయం క్లారిటీతో చెప్పించే దాకా నితిన్ ను కూడ ఇలా తరుచు ప్రశ్నలతో ఇరుకున పెడుతూనే ఉంటారు అనుకోవాలి..  
.


మరింత సమాచారం తెలుసుకోండి: