జూనియర్ పుట్టినరోజునాడు ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి తన అభిమానులకు జోష్ ను కలిగించిన ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం తన తాత నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ‘జనతా గ్యారేజ్’ మూవీ టీజర్ ను విడుదల చేస్తారు అని అనుకున్నారు అంతా. అయితే ఈ టీజర్ విడుదల వాయిదా పడింది.

ఈ వాయిదా నిర్ణయం వెనుక జూనియర్ తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం ఉంది అని అంటున్నారు. ఒక వైపు తెలుగుదేశం మహానాడు జరుగుతున్న నేపధ్యంలో నందమూరి తారకరామారావు పుట్టినరోజునాడు తన ‘జనతా గ్యారేజ్’ టీజర్ ను విడుదల చేస్తే చాలామంది తన టీజర్ గురించి మాట్లాడు కోవడం కామెంట్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాలు తన బాబాయ్ బాలయ్య వరకు వెళితే నందమూరి తారకరామారావు పుట్టినరోజున తాను కబ్జా చేసాను అన్న ఫీలింగ్ బాలకృష్ణకు ఏర్పడుతుంది అన్న అనుమానంతో కొందరు సన్నిహితుల సూచన మేరకు జూనియర్ తన ‘జనతా గ్యారేజ్’ టీజర్ విడుదలను వాయిదా వేసాడు అని టాక్. 

ఇప్పటికే జూనియర్ బాలయ్యల మధ్య గ్యాప్ చాల పెరిగి పోవడంతో ఎదో విధంగా తిరిగి తన బాబాయ్ బాలయ్యకు దగ్గర కావాలనే ఉద్దేశ్యంతో జూనియర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అని కూడ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు చెపుతున్న వెర్షన్ మరోలా ఉంది. ‘జనతా గ్యారేజ్’ టీజర్ కు సంబంధించిన పనులు దర్శకుడు కొరటాల శివ అనుకున్న సమయానికి పూర్తి చేయక పోవడంతో ఈ టీజర్ విడుదల వాయిదా పడింది అనే కామెంట్స్ కూడ ఉన్నాయి. 

ఇది ఇలా ఉండగా జూనియర్ తన తాత ఎన్టీఆర్ పుట్టినరోజునాడు ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉండబోతున్నాడు. దీనివల్ల ఈసారి ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ హంగామా కనిపించదు. అందుకోసమే కాబోలు జూనియర్ ఈసారి రెండురోజులు ముందుగానే తన తాత సమాధి వద్ద పూలు పెట్టి నందమూరి తారక రామారావు జయంతిని రెండురోజులు ముందుగానే జరుపుకున్నాడు. అయితే జూనియర్ చేసిన త్యాగం బాలకృష్ణ దృష్టిలో పడుతుందో లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: