తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. గంగోత్రి చిత్రంలో సాదాసీదాగా కనిపించినా తర్వాత వచ్చిన దేశముదురు, బన్ని, ఆర్య చిత్రాలో తన విశ్వరూపం చూపించాడు. మెగా ఫ్యాన్స్ కావాలసిన డ్యాన్స్, ఫైట్స్,యాక్షన్ అన్నింటా తనదైన స్టైల్ చూపించి స్టైలిష్ స్టార్ అయ్యాడు. ఇక బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం మొదటి మిశ్రమ స్పందన వచ్చిన తర్వాత బ్లాక్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఐదోవారంలోనూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఈ చిత్రం.. ఇంకా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.57.95 కోట్లను కొల్లగొట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.70.3 కోట్లు వసూలు చేసింది.సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సరైనోడు’ సినిమా మొత్తానికి 32 రోజల్లో ఈ టార్గెట్ సాధించింది.  టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో ఇది ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి నాలుగు స్థానాల్లో వరుసగా ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, ‘అత్తారింటికి దారేది’, ‘మగధీర’ వుండగా.. ఆ తర్వాత స్థానంలోకి ‘సరైనోడు’ చేరింది.

అంతే కాదు కొన్ని ఏరియాల్లో ఈ సినిమా ‘నాన్-బాహుబలి’ రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఏపీ మొత్తంలోనూ వైజాగ్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ‘బాహుబలి’ తర్వాత అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా ‘సరైనోడు’ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక సీడెడ్, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదారి, కర్నాటకల్లో టాప్ 3 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. మరో పక్క సూర్య ‘24’, సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ మంచి హిట్ టాక్ తెచ్చుకొని సూపర్ కలెక్షన్లు సాధించినా వాటితో పోటీగా నిలిచి  బాక్సాఫీస్ వద్ద ‘సరైనోడు’ పుంజుకున్నాడు.  ఈ సినిమాకి విడుదలైన రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. రూ.70 కోట్ల క్లబ్‌లో చేరడం నిజంగా విశేషం.





మరింత సమాచారం తెలుసుకోండి: