పసుపు జెండాల రెపరెపల మధ్య భారీ కటౌట్లుతో సినిమా సెట్టింగ్ ను మరిపించే స్టేజ్ తో అత్యంత అట్టహాసంగా నిన్న తిరుపతిలో మొదలైన తెలుగుదేశం మహానాడు వేడుకలలో రాజమౌళి ప్రభాస్ ల నామస్మరణ జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ‘బాహుబలి’ కటౌట్లు మహానాడు ప్రాంగణంలో కూడ కనిపించడం మహానాడు వేడుకకే హాట్ న్యూస్ గా మారింది.

ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే మహానాడు ప్రాంగణంలో చాల చోట్ల తెలుగుదేశ పార్టీ యువనాయుకుడు నారా లోకేష్ ను ‘బాహుబలి’ గా చూపెడుతూ అతడి అభిమానులు చాలాచోట్ల భారీ కటౌట్లు పెట్టారు. బాహుబలి తన తల్లి కష్టం చూడలేక ఏకంగా శివలింగాన్నే పెకలించి భుజస్కందాలపై మోసి గంగమ్మను తల్లి దగ్గరికి తీసుకెళ్లినట్లుగా  చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను సింబాలిక్ ‘బాహుబలి’ గా చూపుతూ మహానాడులో భారీ కటౌట్ ఏర్పాటుచేశారు. 

ఇప్పుడు ఈ కటౌట్ మహానాడు ప్రాంగణంలో అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆఖరుకు నారా లోకేష్ కూడ ఈ ‘బాహుబలి’ కటౌట్ వైపు ఆ శక్తిగా చూసాడు అంటే ఈ కటౌట్ అందరి దృష్టిని ఎంతగా ఆకర్షించిందో అర్ధం అవుతుంది.  ఇది ఇలా ఉండగా నిన్న నందమూరి బాలకృష్ణ కూడ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
తన 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గెటప్ లో వేడుకకు హాజరై అభిమానులను అలరించాడు. భారీ మీసకట్టు శాతకర్ణిని తలపించే హెయిర్ స్టైల్ తో బాలయ్యను చూసిన వారంతా ఫిదా అయిపోయారు.

మరి కొందరైతే మహానాడులో బాహుబలిగా అల్లుడు - శాతకర్ణిగా మామయ్య  మహానాడును అదిరకొట్టేసారు అంటూ కామెంట్ చేసుకున్నట్లు టాక్. అయితే మహానాడును కూడ ‘బాహుబలి’ ఫీవర్ ను వదిలిపెట్టక పోవడం చూస్తూఉంటే రాజమౌళి ప్రభాస్ ల క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్ధంఅవుతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: