యువతరం సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ ది ఓ సరికొత్త ఒరవడి సృష్టించాడని చెప్పాలి. హుశారెత్తే దేవి మ్యూజిక్ తో పాటుగా దేవి తనలోని లిరిసిస్ట్ టాలెంట్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక దేవిలోని మరో టాలెంట్ ను బయట పెట్టింది హాట్ భామ లావణ్య త్రిపాఠి.. అంతేకాదు లావణ్య దేవిలోని ఆ టాలెంట్ ను చూసి ఆశ్చర్యపోయిందట. మరి కేవలం లావణ్యకే కనబడిన దేవి టాలెంట్ ఏంటో మనము తెలుసుకుందాం.


దేవి ఫోటో షూట్ లో హాట్ లావణ్య త్రిపాఠి :


కుర్ర కారుని హోరెత్తించే పాటలతో ఆటలతో దేవి చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక దేవి ఆడియోలో స్టేజ్ ఎక్కాడంటే ఇక ఆ జోరు వేరేలా ఉంటుంది. సూపర్బ్ ఎనర్జీతో దేవి ఓ సంగీత దర్శకుడిగానే కాదు లిరిసిస్ట్ గా, డ్యాన్స్ కంపోజర్ గా కూడా పనిచేస్తుంటడు. ఇక ఎప్పటినుండో దేవి ఓ ఫోటో షూట్ కూడా చేయాలనే కోరిక ఉన్నదట.


అది కూడా హాట్ భామ లావన్య త్రిపాఠి మీదే తీయాలని కోరికట. తనని ఎన్ని సార్లు అడిగినా తర్వాత చూద్దామని నవ్వేసి వెళ్లె లావణ్య రీసెంట్ గా చెన్నైలోని దేవి స్టూడియోకి వెళ్తే అక్కడ ఆమెతో ఓ ఫోటో షూట్ చేశాడు దేవి. దేవి మ్యూజిక్ మాత్రమే కాదు ఫోటో గ్రఫీ కూడా అదరగొడుతుంది. లావణ్య అందాలతో తీసిన ఆ ఫోటో షూట్ కు తన మార్క్ మ్యూజిక్ బిట్ ఇచ్చి కిరాక్ అనిపించేలా చేశాడు దేవి.


దేవి ఫోటో షూట్ లో లావణ్య హాట్ లుక్ :


మరి ఒక మనిషిలో ఇన్ని టాలెంటులు ఉండటం మాములు విషయం కాదు. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా చిందులు వేయడానికి రెడీ అవుతున్న దేవి తనలోని ఫోటోగ్రఫీ టాలెంట్ ను చూపించడంతో అందరు అవాక్కవుతున్నారు. ఇక ఫోటో షూట్లో లావణ్య చూస్తే కుర్ర కారుకి గిలిగింతలు పుట్టడం కామన్. సో మొత్తానికి లావణ్యతో దేవి చేసిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: