తెలుగు ఇండస్ట్రీకి అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య ఇంట్రడ్యూస్ చేస్తూ ‘జోష్’ చిత్రం వచ్చింది..ఆ చిత్రంలో నాగ్ ఫ్రెండ్ గా నటించిన  శ్రేయ ధన్వంతరి ఆ తరువాత స్నేహగీతం చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ రెండు చిత్రాల్లో ఈ అమ్మడికి ఏ మాత్రం పేరు రాలేదు.  దీంతో  ఈ అమ్మడు బాలీవుడ్ కి మఖాం మార్చింది. అడపాదడపా యాడ్లు చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్న శ్రేయ తాజాగా ఒక బూతు ట్రైలర్ తో దర్శనిమిచ్చింది. ఈ ట్రైలర్ మొత్తం సెన్సార్ కట్ లేకుండా సాగిపోతోంది.
YRF comes up with new short film based on ‘Ladies Room’
బూతు డైలాగులు, బూతు బొమ్మలతో మొత్తం ఇదేంటబ్బా అంటూ ఎబ్బెట్టు కలిగేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. యాష్ రాజ్ ఫిలింస్ లేడీస్ రూమ్ అనే వెబ్ సిరీస్‌ని నిర్మించింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌లో ఫచ్, బెంచూద్, చూతే వంటి బూతులు విచ్చలివిడిగా ఉన్నాయి.  ఈ ట్రైలర్ చూసిన వారు షాక్ అవుతున్నారు. వెబ్ వీడియాలకు సెన్సార్ ఉండదని రెచ్చిపోయిన్నట్లున్నారు. పూర్తి బూతులతో ఈ ట్రైలర్ ని నింపేశారు. ఈ ట్రైలర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. మరో వైపు యష్ రాజ్ ఫలింస్ అంటే ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కానీ  ఇంత పెద్ద బ్యానర్, ఇదేం పని అని తిడుతున్నారు. మీరు తిట్టినా, పొగిడినా చూడటం తప్పదంటున్నారు.  ఇందులో శ్రేయ చేసిన వల్గర్ కామెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి లేడీస్ రూమ్ ఓ బూతు ట్రైలర్ అనే చెప్పాలి.

ఏది ఏమైనా ఈ మద్య కాలంలో బాలీవుడ్ లో విపరీతమైన అడల్ట్ కాంటెంట్ సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలకే అక్కడ మంచి గిరాకి ఉంది..అంతే కాదు ఇలాంటి బూతు కాంటెంట్ ఉన్న చిత్రాలకు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇక ఇలాంటి సినిమాలో అన్నీ విప్పి చూపించడానికి శృంగారంలో మునిగిపోవడానికి బి గ్రెడ్ హీరోయిన్లు పోటీ పడీ ముందుకు వస్తున్నారు. మొత్తానికి లేడీస్ రూమ్ ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: