మహానటి సావిత్రిని ఆమె నటించిన సినిమాలను మరిచిపోవడం ఎవరితరం కాదు. ఒక సినిమా కథలో ఉండే ట్విస్టులు అన్నీ సావిత్రి జీవితంలో ఉన్నాయి. బాలీవుడ్  సినిమా రంగంలో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈ జోనర్ లో వచ్చిన సినిమాలు బాగా విజయ వంతం అవుతూ ఉండటంతో దంగల్, ధోని, సచిన్, కిషోర్ కుమార్,సంజయ్ దత్, రాణి లక్ష్మీ భాయ్ వంటివన్నో భారీ సినిమాలు బాలీవుడ్ లో నిర్మిస్తున్నారు.

ఈనేపధ్యంలో మనతెలుగు దర్శకులు కూడా బాలీవుడ్ ని అనుసరస్తూ ఇక్కడ కూడ బయోపిక్ లు తీయడానికి ప్రయత్నాలుచేస్తున్నారు. ఈ తరహా సినిమాలకు ఒక యువ దర్శకుడు శ్రీకారం చుట్ట బోతున్నాడు. అతడు ఎవరో కాదు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్  ‘మహానటి’ అని పిలిపించుకొన్న సావిత్రి జీవితాన్ని వెండి తెరపై చూపెట్ట బోతున్నాడు. ఈ చిత్రం కోసం ఇతడు ఎంతో మందిని కలిసి రీసెర్చ్ చేసి సావిత్రి జీవితంలోని పలు విశేషాలను తెలుసుకున్నానని చెపుతున్నాడు. 

అలాగే ఈ చిత్రాన్ని సీరియస్ ధోరణిలో ఆయన తీయాలనుకోవడంలేదు అని అంటూ సావిత్రి వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నప్పటికీ దాన్ని టచ్ చేయకుండా ఆమె జీవితం తాలూకు సెలబ్రేషన్‌ లా ఈ సినిమా ఉంటుంది అని ఈ యువ దర్శకుడు చెపుతున్నాడు. సావిత్రి జీవితంలోని మరపురాని ఘట్టాలు, ఆసక్తికరమైన అంశాలూ కలిపి ఒక అందమైన కథలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఈ దర్శకుడు తెలియచేస్తున్నాడు. అయితే మహానటి సావిత్రిగా ఎవరు నటిస్తారు ? అన్న విష్యం ప్రస్తుతానికి సస్పెన్స్ అని తెలుస్తోంది. సామాన్య స్త్రీ నుంచి ఒక  సూపర్‌స్టార్‌గా సావిత్రి జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.  ఆమె జీవితం నేటితరం హీరోయిన్స్ కు ఒక పాఠంలా మిగిలి పోయింది.   

ఆమె తరువాత ఇన్నేళ్ళలో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. సావిత్రికి ఎటువంటి బిరుదులు అలనాటి ప్రభుత్యాలు ఇవ్వకపోయినా ఆమె ఇప్పటికీ ఎప్పటికీ ఒక ‘లెజెండ్’. అయితే ఈమె జీవితం పై సినిమా తీయడo మటుకు ఒక సాహసమే అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: