మహానటి సావిత్రి అనగానే తన సహజ నటనతో వెడితెర మీద అభినయ తార గుర్తుకు వస్తుంది. ఆమె అభినయం అందం తెలుగు ప్రజల హృదయాల్లో చెరిగిపోని ఓ సంతకంలా ఉంటాయి. అయితే ప్రముఖుల జీవిత గాథలన్ని సినిమాలుగా వస్తున్న ఈ తరుణంలో సావిత్రి బయోపిక్ కూడా సినిమాగా రూపొందించబడుతుంది. తెలుగు తెర మీద తన అభినయ మంత్రాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు అభినయ దేవతగా అలరించిన సావిత్రి కథ తెరరూపం దాల్చబోతుంది.


అభినయ తార సావిత్రి :


ఇంతటి మహోన్నతమైన సినిమాకు నడుం బిగించింది ఎవరో కాదు. ఎవడే సుబ్రమణ్యం అంటూ సినిమా కేవలం ఆనందించడానికే కాదు ఆలోచించడానికి కూడా అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్నాడు. ఇప్పటికే సావిత్రి జీవిత కథా సారాంశాన్ని సినిమా కథగా సిద్ధం చేసుకున్నాడట ఈ దర్శకుడు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి.


అయితే ఇందులో సావిత్రిగా నటించేది ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. లీడింగ్ యాక్ట్రెస్ నే పెట్టుకుంటారా లేక కొత్త అమ్మాయిని ట్రై చేస్తారా అన్నది కూడా ఎటువంటి సమాచరం అందలేదు. ఇప్పటికే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో కళకలలాడుతున్న తెలుగు పరిశ్రమ ఆ మహానటి ప్రస్థానంతో మరింత కలర్ ఫుల్ గా తయారవనుంది.  


ఎవడే సుబ్రహ్మణ్యం దర్శకుడు నాగ్ అశ్విన్ :


మరి సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా తెలుగు తెరపై చెరిగిపోని చిరునవ్వుగా ప్రేక్షక హృదయాల్లో ఇప్పటికి అభినయ తారగా ఉన్న సావిత్రి జీవిత కథ అందరిని మెప్పిస్తుందని చెప్పొచ్చు. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: